Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో సుప్రసిద్ధ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లలో ఒకటైన ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తమ తాజా టీవీ కమర్షియల్ ను భారతదేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్లకు అవగాహన కల్పిస్తూ ‘పైసోం కో రోకో మత్’ శీర్షికన విడుదల చేసింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యొక్క వృద్ధి సామర్థ్యం నుంచి మదుపరులకు కలిగే ప్రయోజనం ఇది వెల్లడిస్తుంది. ఈ టీవీసీతో, ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ బీఎఫ్ఎస్ఐ రంగంలో అతి సరళమైన, లీనమయ్యే స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లను ఉపయోగించి తమ ప్రత్యేక స్వరాన్ని ఏకీకృతం చేస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యొక్క నిరూపిత ప్రయోజనాలను ఇంటికి తీసుకువెళ్లేందుకు ఈ టీవీసీని స్పష్టంగా, సూటిగా సందేశాన్ని సునిశిత హాస్యం మేళవించి తెలిపే రీతిలో తీర్చిదిద్దారు.
గౌరబ్ పరీజా, హెడ్– సేల్స్ అండ్ మార్కెటింగ్, ఐడీఎఫ్సీ ఏఎంసీ మాట్లాడుతూ ‘‘జీవిత నాణ్యత పెరగడం చేత పెరుగుతున్న ఖర్చులతో పాటుగా పెరిగిన జీవిత కాలం, వైద్య పరంగా పెరుగుతున్న వ్యాధుల వేళ, దీర్ఘకాలంలో ద్రవ్యోల్భణ సమస్యలను సైతం అధిగమించి చేయూతనందించే తరహా పథకాలు కావాల్సి ఉంది. మా తాజా ‘పైసోం కో రోకో మత్’ ప్రకటనను, స్పష్టమైనది అయినప్పటికీ తగిన రీతిలో ప్రశంసించబడని అంశంపై మదుపరులు దృష్టి సారించేలా తీర్చిదిద్దాం. సంపద సృష్టిలో ఈక్విటీలు అతి ముఖ్యమైన ఆస్తి తరగతిగా ఎన్నో సంవత్సరాలుగా వెలుగొందుతున్నాయి. వీటికి పెరుగుతున్న ద్రవ్యోల్భణంను సైతం తట్టుకునే శక్తి దీర్ఘకాలంలో ఉంది. అందువల్ల మదుపరులు తమ జీవిత ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో ఇవి తోడ్పడతాయి’’ అని అన్నారు
‘పైౖసోం కో రోకో మత్’ ప్రచారం యొక్క ప్రధానమైన ఆలోచన, మన ఎదుగుదలకు అడ్డంకిగా మారిన జడత్వం నుంచి ప్రేరణ పొందుతుంది. ఈ ప్రచారం కోసం రూపొందించిన తమ క్రియేటివ్స్ ద్వారా ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఓ తాజా, సంప్రదాయేతర విధానం అనుసరించింది. సంపద సృష్టి గురించిన సంభాషణను సంప్రదాయం నుంచి సమకాలీనానికి మార్చింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో వ్యంగ్యంతో హాస్యాన్ని మిళితం చేసి చెప్పడమ్నది ఈ విభాగంలో ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ చేపట్టిన ఓ సృజనాత్మక అంశం. టీబీడబ్ల్యుఏ యాడ్ ఏజెన్సీ భాగస్వామ్యంతో సృష్టించిన ఈ దేశవ్యాప్త ప్రచారం టెలివిజన్, ప్రింట్, ఔట్‌డోర్, డిజిటల్ మాధ్యమాల వ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉండనుంది.