Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ఎక్సాన్ మొబిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఎక్సాన్ మొబిల్ లూబ్రికెంట్స్ కొత్తగా మొబిల్ సూపర్ ఆల్ ఇన్ వన్ ప్రొటెక్షన్ ఎస్యువి ప్రొ సింథటిక్ ఇంజిన్ ఆయిల్‌ను ఆవిష్కరించింది. ప్యాసింజర్ వాహనాల్లో స్పోర్ట్ యుటిలిటీ వాహనాల విక్రయాలు దాదాపు మూడో వంతుకు చేరడంతో ఈ నూతన శ్రేణీ ఇంజిన్ ఆయిల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎక్సాన్ మొబిల్ లూబ్రికెంట్స్ సీఈఓ దీపాంకర్ బెనర్జీ పేర్కొన్నారు. ఇది ప్రత్యేకంగా ఎస్యువి ఇంజిన్ల కోసం యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్‌తో రూపుదిద్దుకుందన్నారు ఇది 1, 3.5, 5 లీటర్ల పరిమాణాల్లో లభిస్తుందన్నారు.