Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ద్విచక్రవాహనాలు మరియు మూడు చక్రాల వాహనాల తయారీ పరంగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన టీవీఎస్ మోటర్ కంపెనీ నేడు తమ TVS iQube Electric స్కూటర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. గ్రీన్ మరియు కనెక్టడ్ , సవారీ చేసేందుకు వినోదాత్మకమైన పట్టణ స్కూటర్ TVS iQube Electric అత్యాధునిక ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్ మరియు భావితరపు TVS SmartXonnect ప్లాట్‌ఫామ్‌తో ఇది శక్తివంతమైంది. ఈ ఆవిష్కరణ గురించి టీవీఎస్ మోటర్ కంపెనీ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కె ఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ ‘‘ ప్రపంచ శ్రేణి గ్రీన్ మరియు కనెక్టడ్ ఉత్పత్తులను అందిస్తున్న డిజిటల్ తరపు కంపెనీగా టీవీఎస్ మోటర్ కంపెనీ మారుతుంది. భారతదేశం దూసుకుపోతున్న వేళ, దీని రవాణా పరిష్కారాలు అనుభవ ఆధారితంగా మారుతున్నాయి మరియు నేటి యువత నడుమ ఇది మరింత విస్తృతంగా కనిపిస్తుంది. భారతీయ యువతపై మా దృష్టి ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో తొలి నుంచి ఉంది. TVS iQube ఎలక్ట్రిక్ అత్యాధునిక ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్ మరియు భావి తరపు TVS SmartXonnect వేదికల సమ్మేళనం. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరు, కొచి, పూనెలలో సానుకూల స్పందన తరువాత, మా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హైదరాబాద్‌కు వరల్డ్ ఈవీ డే సందర్భంగా తీసుకురావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ నూతన శిఖరాలను ఈ స్కూటర్ ద్వారా చేరుకోగలమనే విశ్వాసంతో ఉన్నాం. TVS iQube Electric వ్యవస్థను డిజిటల్ వేదికల చుట్టూ నిర్మించడం జరిగింది. ఇది వినియోగదారులకు సంపూర్ణమైన డిజిటల్ వాణిజ్య అనుభవాలను అందిస్తుంది’’ అని అన్నారు.
అత్యున్నత పనితీరు
TVS iQube Electric లో 4.4 కిలోవాట్ ఎలక్ర్టిక్ మోటర్ ఉంది. ఇది అత్యధిక శక్తి మరియు సామర్థ్యంను ఎలాంటి ప్రసార నష్టాలు లేకుండా అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్లు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ సున్న నుంచి 40 కిలోమీటర్ల/గంట వేగాన్ని కేవలం 4.2 సెకన్లలో అందుకుంటుంది.
అత్యున్నత కనెక్టివిటీ
కనెక్టడ్ మొబిలిటీ పరంగా ఇతర సంస్ధల కన్నా ఇప్పటికే టీవీఎస్ మోటర్ ముందుండటం మాత్రమే కాదు పరిశ్రమ కోసం బెంచ్మార్క్గానూ నిలిచింది. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్తూ, TVS iQube Electric లో భావి తరపు TVS SmartXonnect platform ఉంది. దీనితో పాటుగా అత్యాధునిర టీఎఫ్టీ క్లస్టర్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ యాప్ సైతం ఉన్నాయి. ఈ యాప్ బహుళ ప్రయోజనాలు అయినటువంటి జియో –ఫెన్సింగ్, రిమోట్ బ్యాటరీ చార్జ్ స్థితి, నేవిగేషన్ అసిస్ట్, చివరి పార్కింగ్ ప్రాంతం, ఇన్కమింగ్ కాల్స్/ఎస్ఎంఎస్ అలర్ట్స్ వంటివి సైతం అందిస్తుంది.
సాటిలేని సౌకర్యం, సదుపాయం కోసం వినూత్నమైన ఫీచర్లు
TVS iQube Electric స్కూటర్ వినూత్నమైన ఫీచర్లతో వస్తుంది. ఇది సాటిలేని సౌకర్యాలైనటువంటి క్యు–పార్క్ అసిస్ట్ , మల్టీ సెలెక్ట్ ఎకనమీ మరియు పవర్ మోడ్, పగలు మరియు రాత్రి డిస్ప్లే,రీజనరేటివ్