Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే రెండేండ్లలో మరో 250 స్టోర్లు ఏర్పాటు
- మహేశ్ బాబు బ్రాండ్ అంబాసీడర్‌గా అద్భుతమైన ప్రాచుర్యం : సిఎండి బాలు చౌదరీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 250కిపైగా స్టోర్స్ నెలకొల్పిన బిగ్ సి చరిత్ర సృష్టిస్తోంది. అద్భుతమైన ప్రజాదరణ, ప్రాచుర్యంతో మూడు రాష్ట్రాల మార్కెట్లో 30శాతం వాటాను సాధించి వినియోగదారుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ఒప్పందం చేసుకున్నాక అమ్మకాలు పెరిగాయని, బ్రాండ్ విలువ పల్ల ప్రజల్లో ఆసక్తి పెరిగిందని పత్రికా సమావేశంలో బిగ్ సి డైరెక్టర్లు స్వప్న కుమార్, జి.బాలాజీ రెడ్డి, కైలాష్ లఖ్యనీ, గౌతం రెడ్డి వెల్లడించారు. బిగ్ సి అమ్మకాల్లో ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ వాచీలు...మొదలైనవి ఉన్నాయని, వినియోగదారుల విశ్వసనీయతను తమ సంస్థ సేవలు అందుకున్నాయని వారు చెప్పారు. ఆర్డర్ ప్లేస్ చేసిన 90 నిమిషాల్లో బిగ్ సి తన బలమైన, విస్తారమైన నెట్వర్క్ ద్వారా వినియోగదారులకు వారు కోరిన మొబైల్ అందజేస్తోందని అన్నారు. బిగ్ సి తన ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ ద్వారా వేగవంతమైన డెలివరీ సేవలను కొనుగోలుదారులకు అందిస్తోందిని తెలిపారు.