Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పండుగ సీజన్‌కు సిద్ధమవుతున్నారా ? సంగీతంతో ఈ క్షణాలను వేడుక చేసుకోండి. తమ సరికొత్త ఎఫ్ అండ్ డీ పీఏ 300 100 వాట్ బ్లూటూత్ వైర్లెస్ పార్టీ స్పీకర్ సిస్టమ్‌ను పండుగ సీజన్ కోసం ఆవిష్కరిస్తున్నట్లు ఫెండా ఆడియో వెల్లడించింది. ఈ నూతన స్పీకర్లో శక్తివంతమైన పనితీరు, బహుళ ఇన్పుట్స్, కరావోకే మోడ్, విస్తృత శ్రేణి పోర్టబల్ బాడీ ఉన్నాయి. ఈ ఫెండా ఆడియో ఎఫ్ అండ్ డీ పీఏ300, ఔట్‌డోర్ మరియు ఇండోర్‌లో సైతం వినియోగించుకునేందుకు అనువుగా ఉండటంతో పాటుగా రీచార్జబల్ బ్యాటరీతో సహా వస్తుంది. పండుగ సీజన్ అంటేనే సంగీతపు వేడుకలా ఉంటుంది. అది భజన్లు, ఉత్సాహపూరితమైన సంగీతం లేదా తాజా బాలీవుడ్ బీట్స్... ఎక్కడైనా సరే ఫెండా ఆడియో యొక్క తాజా స్పీకర్ వ్యవస్ధ, ప్రజలను ఏకం చేస్తుంది. ఓ జత భారీ 7 అంగుళాల ఊఫర్స్ మరియు ఓ జత 2 అంగుళాల ట్వీట్స్ తో పాటుగా శక్తివంతమైన 100 వాట్ యాంప్లిఫైయర్ కలిగిన ఎఫ్ అండ్ డీ ీ పఏ 300, మీరు ప్రతి నోట్‌నూ స్పష్టంగా వినగలుగుతున్నారన్న భావన అందిస్తుంది. ఆకర్షణీయమైన ఈ స్పీకర్‌కు మరింత వన్నెలద్దుతూ డిస్కో లైట్లు, రిథమ్‌కు అనుగుణంగా పనిచేస్తూ ఉత్సాహాన్ని మరింత పెంచుతాయి. అంతేకాదు, దీనిలోని7000 ఎంఏహెచ్ రీచార్జబల్ బ్యాటరీ మీ ఔట్‌డోర్ పార్టీలకు మరింత ఆనందాన్ని అందిస్తూ ఏకధాటిగా 5 గంటలు పనిచేస్తుంది. ఫెండా ఆడియో ఎఫ్ అండ్ డీ పీఏ 300లో అత్యున్నత ఫీచర్లు ఉన్నాయి. యుఎస్బీ, ఆక్సిజలరీ, ఆప్టికల్, బ్లూటూత్, మైక్రోఫోన్, గిటార్ ఇన్పుట్స్ కలిగిన ఈ స్పీకర్లో అంతర్గతంగా నిర్మించిన ఎఫ్ఎం రేడియో సైతం ఉంది. చివరగా, దీనిలోని కరావోకేమోడ్ వైర్డ్, వైర్లెస్ మైక్రోఫోన్‌కు సైతం మద్దతునందిస్తుంది. అందువల్ల మీరు మీ మైక్‌ను స్పీకర్ కదిలించాల్సిన అవసరం లేకుండానే అందించవచ్చు. స్పీకర్ పై భాగంలో కంట్రోల్స్ లభ్యమవుతాయి.రిమోట్ కంట్రోల్‌తో కూడా మీరు దీనిని నియంత్రించవచ్చు. ఎఫ్ అండ్ డీ పీఏ300 స్పీకర్లు, సుప్రసిద్ధ రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ వేదికలపై పండుగ సీజన్ పరిమిత కాల ఆఫర్‌గా 15,999 రూపాయలలో 12 నెలల వారెంటీతో లభ్యమవుతుంది.