Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ముంబై
ఇండియన్ కెమికల్ కౌన్సిల్ నుంచి స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ లానెక్సెస్ ఇండియా మూడు ప్రతిష్టాత్మక అవార్డులను పొందింది. మరీ ముఖ్యంగా ఆరోగ్యం, సురక్షిత విభాగంలో సంస్థ కట్టుబాటుకు, తిరుగులేని పనితీరుకు అది గుర్తింపుగా నిలిచింది. ఎక్స్ లెన్స్ ఇన్ మేనేజ్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ, బెస్ట్ రెస్పాన్సిబుల్ కేర్ కమిటెడ్ కంపెనీ, రెస్పాన్సిబుల్ కేర్ కింద బెస్ట్ కంప్లియెంట్ కంపెనీ కి సంబంధించి ఐసీసీ సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్, బెస్ట్ నైసర్ గ్లోబ్ యూజర్ కంపెనీ అవార్డులను పొందింది.
సెప్టెంబర్ 24న శుక్రవారం నాడు వర్చువల్ గా జరిగిన అ వార్డు ప్రదానోత్సవంలో ముఖ్యఅతిథి, గౌరవనీయ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి, మన్ సుఖ్ మాండవీ య, గౌరవ అతిథి, కేంద్ర రసాయనాలు, పెట్రో కెమికల్స్ అదనపు కార్యదర్శి, ఐ ఏఎస్ అధికారి సమీర్ కుమార్ బిస్వాస్ లుఈ అవార్డులను లానెక్సెస్ ఇండియాకు బహుకరించారు.
దీనిపై లానెక్సెస్ ఇండియా వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ నీలాంజన్ బెనర్జీ మాట్లాడుతూ, 'మా సిబ్బంది, సమాజం పట్ల మాకు గల అంకితభావానికి ఈ అవార్డులు నిదర్శనం. ఇలా గుర్తించినందుకు ధన్యవాదాలు. నిరంతర మెరుగుద లకు మా ప్రయాణాన్ని కొనసాగిస్తాం` అని అన్నారు.
2020 సంవత్సరానికి దిగువ ఐసీసీ అవార్డులను గెలుపొందిన సంస్థ
ఎక్స్ లెన్స్ ఇన్ మేనేజ్ మెంట్ ఆఫ్ హెల్త్ డ సేఫ్టీ
బెస్ట్ రెస్పాన్సిబుల్ కేర్ కమిటెడ్ కంపెనీ
బెస్ట్ నైసర్ గ్లోబ్ యూజర్ కంపెనీ
లానెక్సెస్ గురించి :
లానెక్సెస్ అగ్రగామి స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ. 2020 లో దీని విక్రయాలు 6.1 బిలియన్ యూరోలు. కంపెనీ ప్రస్తుతం 33 దేశాల్లో 14,800 మంది సిబ్బందిని కలిగి ఉంది. కెమికల్ ఇంటర్మీడియేట్స్, అడిటివ్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్లాస్టిక్స్ డెవలప్ మెంట్, తయారీ, మార్కెటింగ్ అనేది లానెక్సెస్ ప్రధాన వ్యాపారం. అగ్రగామి సస్టెయినబిలిటీ సూచీలు డౌ జోన్స్ సస్టెయినబిలిటీ ఇండెక్స్, FTSE4Good లలో లానెక్సెస్ లిస్ట్ అయింది.