Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్
పౌల్ట్రీ దాబా మద్దతుతో, యూఎస్ఎస్ఈసీ (యూఎస్ సోయాబీన్ ఎక్స్ పోర్ట్ కౌన్సిల్) అండతో జరి గిన కార్యక్రమం 'హమారా ప్రొటీన్ తాలి`లో 28 రుచికరమైన, సంపూర్ణ ప్రాంతీయ భారతీయ భోజనాలను ప్రదర్శించారు. పంజాబ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ... ఇలా ఒక్కో రాష్ట్రం నుంచి వంటకాలు వచ్చాయి. అవన్నీ కూడా సంపూర్ణ సమతుల్య ఆహారాన్ని అందించేవే. తగినంత మొత్తంలో ప్రొటీన్లతో ఉండే సమతుల్య ఆహార ప్రాధన్యాన్ని చాటిచెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. రోగనిరోధకత, ఆరోగ్యం లలో ప్రొటీన్లు కీ లక పాత్ర వహిస్తాయి.
వివిధ రాష్ట్రాల నుంచి వైవిధ్యభరిత వంటకాలను చేర్చే కార్యక్రమం 'హమారీ ప్రొటీన్ తాలి` కి ప్రముఖ పోషక నిపుణులు, సంస్థలు అండగా నిలిచారు. సమతుల్య ఆహారం కోసం సరైన ఆహార సంబంధిత ఆవశ్యకతలు ఉంటాయి. శాకాహార, మాంసాహార ఆహారపదార్థాలు ఇందులో ఉంటాయి. చికెన్, గుడ్లు లాంటివి బాగా శక్తిని కలిగి ఉంటే తాలిని అందిస్తాయి. హై ప్రొటీన్ తెలంగాణ వెజిటేరియన్, నాన్ ఉ వెజిటేరియన్ తాలీలను డైటీషియన్ సైని నర్వాడే తయారు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ జానకి బడుగు (ఐఏపీఈఎన్ హైదరాబాద్ శాఖ గౌరవ కార్యదర్శి, ఐడీఏ హైదరాబాద్ శాఖ, మాజీ వీపీ) మాట్లాడుతూ మనం ఏం తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి అనే అంశంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఈ మహమ్మారి మరింత అధికం చేసిందన్నారు. సంప్రదా యక భారతీయ తాలి అనేది సమతుల్య ఆహారానికి ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పారు. అవసరమైన పోషక విలువలను పొందేందుకు అది తోడ్పడుతుందని, ఇంట్లో మనం కొన్ని రకాల దినుసులు ఉపయోగించ డం ద్వారా తాలిలో తగినంతగా ప్రొటీన్ ఉండేలా చూసుకోవచ్చని తెలిపారు. భారతదేశంలో యువతరం తినే విధానంలో ఇటీవలి కాలంలో భారీ మార్పు చోటు చేసుకుందని చెప్పారు. పాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ గణనీయంగా చోటు చేసుకుంటున్నాయన్నారు. అయితే ఈ విధమైన (తాలి) ఫార్మాట్ లో తినడం ప్రాధాన్యం గురించి మన యువతరానికి తెలియజెప్పడం ముఖ్యమన్నారు. వారు ఎన్నో అనారోగ్యకర ఎంపికలకు లోనవుతున్నారని, అందుకే హై ప్రొటీన్ రీజనల్ తాలి భావన ఒక ఆహ్వానించదగిన చర్య గా మారిందని తెలిపారు. హైదరాబాద్ చక్కటి చికెన్ బిర్యానీకి ప్రసిద్ధి చెందిందని, శాకాహారుల విషయానికి వస్తే, రోజూ తీసుకునే అన్నం లేదా పులావ్ కు సోయా చంక్స్ ను జోడించడం మంచిదని చెప్పారు.
పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంపై అవగాహన పెంచే ఉద్దేశంతో తాలి కాన్సెప్ట్ రూపు ది ద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్యాకెట్ల నుంచి ఆహారం తినేందుకు అలవాటు పడ్డారు. భారత దేశం లోనూ యువతరం జంక్ ఫుడ్ కు బాగా అలవాటు పడింది. అది మెటబాలిక్ వ్యాధులకు, ఇతర వ్యాధులకు దారి తీసే అవకాశం కూడా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పోషకాల ప్రాధాన్యాన్ని చాటిచెబుతూ ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. సుస్థిరదాయక సంప్రదాయక ఆహార వ్యవస్థను అనుసరించేందుకే ఈ ప్రయత్నం. అలా చేయడం ప్రతీ ఒక్కరికీ పోషకాలను అందిస్తుంది. అది మన రోజువారీ అవసరాలకు సరిపడిన మొత్తంలో ప్రొటీన్లను అందిస్తుంది.