Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ముంబయి
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన పరిధిని రానున్న 18-24 నెలల్లో రెండు లక్షల గ్రామాలకు విస్తరించే లక్ష్యాన్ని కలిగి ఉంది. బ్యాంకు ఈ విస్తరణను శాఖల నెట్వర్క్, బిజినెస్ కరస్పాండెంట్స్, బిజినెస్ ఫెసిలిటేటర్స్, సిఎస్సి పార్ట్నర్స్, వర్చ్యువల్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మరియు డిజిటల్ ఔట్రీచ్ ప్లాట్‌ఫారాల విస్తరణ సంయోజనను కలిగి ఉంది. ఇది బ్యాంక్ గ్రామీణ ఔట్రీచ్ను దేశంలోని గ్రామాల్లో మూడింట ఒక మేర ప్రమాణానికి వృద్ధి చేసుకోనుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రస్తుతం తన ఉత్పత్తులు, సేవలన 550కు పైగా జిల్లాల్లో ఎంఎస్ఎంఇలకు అందిస్తోంది. ఇది బ్యాంకింగ్ సేవలను ఎంఎస్ఎంఇలకు విస్తరించడంలో ముందంజలో ఉండగా, ఆర్థిక ప్రగతి, ఉద్యోగ సృష్టిలో ప్రముఖ ఇంజిన్‌గా ఉంది. దీని గ్రామీణ బ్యాంకింగ్ సేవలు 100,000 భారతదేశంలోని గ్రామాలకు విస్తరించాయి. ఇప్పుడు వీటిని 2,00,000 గ్రామాలకు చేర్చడం ద్వారా రెట్టింపు చేసే ఉద్దేశాన్ని కలిగి ఉంది. ఈ పథకంలో భాగంగా వచ్చే 6 నెలల్లో 2,500 మందిని సంస్థ ఉద్యోగాల్లోకి తీసుకోనుంది.
తన గ్రామీణ విస్తరణ ప్రణాళిక గురించి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ రాహుల్ శుక్లా మాట్లాడుతూ 'భారతదేశంలోని గ్రామీణం, చిన్న పట్టణాల్లోని మార్కెట్లు రుణ విస్తరణలో తక్కువ సేవలు అందుకుంటున్నాయి. అది భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు సుస్థిరమైన దీర్ఘావధి ప్రగతి అవకాశాలను అందిస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దేశ సేవలో రుణాలు మంజూరు చేయడాన్ని విస్తరించేందుకు కట్టుబడి ఉంది. మేము ప్రతి ఒక పిన్కోడ్లోనూ అందుబాటులో ఉండాలన్న కలను కలిగి ఉన్నాము` అని తెలిపారు.
'భారత ప్రభుత్వం పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను మార్చుతోంది. మేము బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల రంగంలో బాధ్యతాయుతమైన నాయకునిగా కొనసాగడంలో నమ్మకాన్ని ఉంచాము, దానికి ఈ శ్రేణిలో అత్యుత్తమ బ్యాంకింగ్ ఉత్పత్తులను, సేవలను సమాజంలోని అన్ని వర్గాలకూ అంది స్తోంది. మా డిజిటల్ ఇనీషియేటివ్ మా పరిధిని భారతదేశంలోని అత్యంత కుగ్రామాలకూ విస్తరించడం ద్వారా పెద్ద పాత్రను పోషించనుంది. మాకు మన దేశ ప్రగతికి ఆర్థికంగా దూరంగా ఉన్న వారికి రుణాలు మంజూరు చేసేందుకు మాకు మద్ధతు ఇవ్వనుందని` శుక్లా వివరించారు.
తన సేవలను విస్తరిస్తూ వస్తున్న బ్యాంకు తన సంప్రదాయక ఉత్పత్తులు, సేవలు అలాగే కొత్త సేవలను అందించనుంది. ఇది ఇప్పటికే కోతలకు ముందు, అనంతరం పంట రుణాలు, ద్విచక్ర వాహనాలు, వాహన రుణాలు, ఆభరణ రుణాలు తదితర క్యూరేటెడ్ రుణ ఉత్పత్తులను బ్యాంకు సేవలు పొందని, బ్యాంకు సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు విస్తరించింది. ఇది ఇప్పటికే తన ఆఫర్లను అత్యంత వేగంగా మారుతున్న గ్రామీణ ఎకోసిస్టమ్ దృష్టిలో ఉంచుకుని అందిస్తోంది.