Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్
శాంసంగ్ రెండు ప్రత్యేక ఆఫర్లు తీసుకొచ్చింది. బిగ్ టీవీ ఫెస్టివల్, హోమ్ లైక్ నెవర్ బిఫోర్ ను టీవీలు, డిజిటల్ అప్లయెన్సస్ పై ఆఫర్లను విడుదల చేసింది. ఈ ఉత్సాహపూరితమైన ప్రొడక్ట్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలతో పాటుగా ఇవి వస్తాయి. వీటిలో క్యాష్‌బ్యాక్, ఖచ్చితమైన బహుమతులు, సులభమైన ఈఎంఐలు ఉన్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 25 నవంబర్ 10,2021 వరకూ అన్ని సుప్రసిద్ధ శాంసంగ్ రిటైలర్ల వద్ద దేశవ్యాప్తంగా లభ్యమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ బిగ్ టీవీ ఫెస్టివల్, ఎంపిక చేసిన 55 అంగుళాలు, ఆ పైన పరిమాణం కలిగిన నియో క్యుఎల్‌ఈడీ మరియు క్యుఎల్‌ఈడీ టీవీలు బీ 75 అంగుళాలు మరియు ఆ పైన పరిమాణం కలిగిన క్రిస్టల్ 4కె యుహెచ్డీ టీవీలపై లభ్యమవుతుంది. ఇవి ప్రీమియం సిసిమాటిక్ అనుభవాలు, లీనమయ్యే వినోదం, మెరుగైన ఉత్పాదకత మరియు కనెక్టివిటీనీ ప్రియమైన వారితో అందిస్తాయి. ఈ ఆఫర్‌తో, వినియోగదారులు 1,04,900 రూపాయల విలువ కలిగిన సౌండ్‌బార్‌ను ఎంపిక చేసిన టీవీలపై పొందడంతో పాటుగా 20శాతం వరకూ క్యాష్‌బ్యాక్, అతి సులభమైన ఈఎంఐ అతి తక్కువగా 1990 రూపాయలతో ఆరంభం కావడం వంటి ఆఫర్లను సైతం పొందవచ్చు. టీవీలపై మూడు సంవత్సరాల పూర్తి వారెంటీ, ఎంపిక చేసిన క్యుఎల్‌ఈడీ టీవీలపై 10 సంవత్సరాల నో స్ర్కీన్ బర్న్ ఇన్ వారెంటీని అందిస్తుంది.
ఇక హోమ్ లైక్ నెవర్ బిఫోర్ ఆఫర్లను తమ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్స్ మరియు ఎయిర్ కండీషనర్లు వంటి వాటిపై అందించింది. ఈ ఆఫర్ కింద, వినియోగదారులు 25శాతం వరకూ క్యాష్‌బ్యాక్‌ను పొందడంతో పాటుగా అతి తక్కువగా 990 రూపాయల ప్రారంభ ధరతో ఈఎంఐలను సైతం పొందవచ్చు. ఎంపిక చేసిన మైక్రోవేవ్స్పై కాంప్లిమెంటరీ బోరోసిల్ కిట్, 5 సంవత్సరాల పాటు సమగ్రమైన వారెంటీ, ఎంపిక చేసిన ఏసీలపై ఉచిత ఇన్స్టాలేషన్, పలు శాంసంగ్ కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ ఉత్పత్తులపై ఎక్స్టెండెడ్ వారెంటీని సైతం పొందవచ్చు.
శాంసంగ్ ఇండియా, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ మాట్లాడుతూ పెద్ద స్ర్కీన్ టీవీలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. కేవలం ప్రీమియం సినిమాటిక్ అనుభవాలను అందించడం మాత్రమే కాదు, వారి లివింగ్ స్పేస్‌కు వైవిధ్యమైన శైలినీ అందిస్తుంది. ఇటీవలి కాలంలో భారీ సామర్థ్యం కలిగిన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్స్కు సైతం డిమాండ్ పెరిగింది. అలాగే ఇటీవలి కాలంలో కుటుంబాలు రెండవ మరియు మూడవ ఏసీలను సైతం తమ ఇంటికి కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. ఇంటి వద్ద నుంచి పనిచేయడం లేదా అభ్యసించడం ఇప్పటికీ కొనసాగుతుండటం కూడా దీనికి ఓ కారణం. మేము మా బిగ్ టీవీ ఫెస్టివల్ మరోమారు తీసుకురావడంతో పాటుగా హోమ్ లైక్ నెవర్ బిఫోర్ ఆఫర్లను పరిచయం చేశాం. తద్వారా వేడుకలను మరింత ప్రత్యేకంగా మరియు మరుపురానిదిగా మలిచాము` అని అన్నారు.
శాంసంగ్ వైవిధ్యమైన ఉత్పత్తి శ్రేణి
శాంసంగ్ క్యుఎల్‌ఈడీ టెలివిజన్లు
ప్రీమియం టీవీలు మరియు గృహ వినోదంలో నూతన ఆవిష్కరణలను శాంసంగ్ క్యుఎల్‌ఈడీ టీవీలు చేశాయి. అత్యాధునిక చిత్ర నాణ్యత మద్దతుతో అత్యద్భుతమైన డిజైన్‌ను ఇవి అందించాయి. క్వాంటమ్డాట్ టెక్నాలజీ శక్తివంతం కావడం చేత ఇవి టీవీ బ్రైట్నెస్ స్థాయిలను ఆప్టిమైజ్ చేయడంతో పాటుగా ప్రకాశవంతమైన మరియు లోతైన రంగులను అందిస్తూ సృష్టికర్తలు ఉద్దేశించిన దృశ్య అనుభవాలను అందిస్తాయి. ఈ క్యుఎల్‌ఈడీ టీవీలలో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్(ఓటీఎస్) మరియు యాక్టివ్ వాయిస్ యాంప్లిఫయర్ (ఏవీఏ) వంటివి ఇంటి వద్దనే సాటిలేని సినిమాటిక్ అనుభవాలను అందిస్తాయి. యూజర్లు వాయిస్ కంట్రోల్ నియంత్రణలో ఒక అడుగు ముందుకు వేసేలా ఒన్ రిమోట్ కంట్రోల్‌పై ఉన్న నూతన బిక్స్బీ మరియు అదనపు కనెక్టర్లు లేదా క్లిష్టమైన సెటప్స్ లేకుండా అన్ని అనుసంధానిత ఉపకరణాలు నియంత్రించేందుకు అలెక్సా ఫీచర్ సైతం తోడ్పడుతుంది.
శాంసంగ్ స్పేస్మ్యాక్స్ ఫ్యామిలీ హబ్
మొత్తం కుటుంబానికి అనుసంధానిత లివింగ్ ఫన్జోన్గా మీ కిచెన్‌ను మార్చడంలో శాంసంగ్ స్పేస్ మ్యాక్స్ ఫ్యామిలీ హబ్ తోడ్పడుతుంది. అదే సమయంలో హోమ్ కంట్రోల్ ఫీచర్ శాంసంగ్ థింగ్స్ ఎకో సిస్టమ్‌తో కలిసి పనిచేయడంతో పాటుగా తమ ఫ్యామిలీ హబ్ స్ర్కీన్ ద్వారా తమ అనుసంధానిత అప్లయెన్సెస్‌ను పర్యవేక్షించడంతో పాటుగా నియంత్రించేందుకు సైతం తోడ్పడుతుంది. ఫుడ్ మేనేజ్మెంట్ ఫీచర్‌తో ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచైనా డోర్ తెరువకుండానే ఏముందో చూడవచ్చు. సంగీత అనుభవాలను అత్యున్నత నాణ్యత కలిగిన స్పీకర్లతో అందించడంతో పాటుగా స్మార్ట్‌ఫోన్ లేదా టీవీని ఫ్యామిలీ హబ్ స్ర్కీన్‌తో మిర్రర్ చేసుకునేందుకూ వీలు కల్పిస్తుంది. కుటుంబసభ్యులు తమ షెడ్యూల్స్‌ను అనుసంధానించుకోవడంతో పాటుగా ఫ్యామిలీ కనెక్షన్ ఫీచర్‌ను వినియోగించుకుని చిత్రాలను పంచుకోవడం మరియు టెక్ట్స్ సందేశాలను రిఫ్రిజిరేటర్ టచ్ స్ర్కీన్ఫీచర్ ద్వారా పంపడం చేయవచ్చు. బ్లూ టూత్‌తో మీరు ఎన్నడూ ఓ కాల్‌ను మిస్ కావడం జరుగదు. అది మీరు కిచెన్‌లో కుకింగ్ లేదా బేకింగ్ చేస్తున్నప్పుడు కూడా కాల్ మిస్కారు. శాంసంగ్ వాయిస్ అసిస్టెంట్ బిక్స్బీ వ్యక్తిగత గొంతులను గుర్తుపట్టడంతో పాటుగా వారి ప్రాధాన్యతలకనుగుణంగా వ్యక్తిగతీకరించిన సమాచారమూ అందిస్తుంది.
శాంసంగ్ కర్డ్ మ్యాస్ట్రో రిఫ్రిజిరేటర్లు
ఈ రిఫ్రిజిరేటర్లు, రోజువారీ పెరుగు తయారీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడంతో పాటుగా రిఫ్రిజిరేటర్లను సంప్రదాయ పరంగా వినియోగించడాన్ని సమూలంగా మార్చే రీతిలో తీర్చిదిద్దారు. ఇది రిఫ్రిజిరేటర్ అంటే ఆహారం నిల్వచేయడం అనే భావన నుంచి ఆహారం తయారు కూడా చేస్తుందని తెలుపుతుంది. కర్డ్ మ్యాపోట్ర్ ఇప్పుడు ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన పెరుగును ప్రతి సారీ ఒకే రీతిలో చేయడంతో పాటుగా విభిన్నమైన వాతావరణ పరిస్థితులలో పెరుగు తయారీలోని కష్టాన్నీ తొలగిస్తుంది. శాంసంగ్ కర్డ్ మ్యాస్ట్రో రిఫ్రిజిరేటర్లలో పెరుగు తయారీ ప్రక్రియను ఐసీఏఆర్ఉ నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్డీఆర్), కర్నాల్ సూచించింది.
శాంసంగ్ మైక్రోవేవ్స్
వినియోగదారులు ఇప్పుడు మసాలా, తడ్కా, సన్ డ్రై ఫుడ్‌ను సైతం చేసుకోవచ్చు. వీటితో పాటుగా రోటీ/నాన్ మరియు కర్డ్‌ను ఈ నూతన మైక్రోవేవ్ శ్రేణితో చేసుకోవచ్చు.
శాంసంగ్ విండ్ ఫ్రీ ఏసీలు 3.0
శాంసంగ్ విండ్ ఫ్రీ 3.0 సిస్టమ్, 23వేల మైక్రో హోల్స్‌ను వినియోగించుకుని అతి సున్నితంగా గాలిని గదిలో సమానంగా పంపిణీ చేస్తుంది. ఎలాంటి డ్రాఫ్ట్ అవసరం లేకుండా సౌకర్యవంతమైనస్థాయి చల్లదనం నిర్వహిస్తుంది. ఒకసారి కోరుకున్న ఉష్ణోగ్రత చేరుకున్న తరువాత, ఈ సిస్టమ్ తాజా గాలిని సమానంగా పంపిణీ చేస్తుంది. ఈ విండ్ ఫ్రీ 3.0 ఏసీలను వినియోగదారులు బిక్స్బీ వినియోగించి వైఫై ద్వారా నియంత్రించే అవకాశం కల్పిస్తుంది. ఈ ఏసీలు వినియోగదారులు ఇతర ప్రాంతాల నుంచి కూడా పనితీరు నియంత్రించే అవకాశం అందించడంతో పాటుగా లైవ్ ఫీడ్‌బ్యాక్‌తో షెడ్యూల్ ఆపరేషన్స్ కూడా సాధ్యం చేస్తాయి. ఈ ఏఐ ఆటో కూలింగ్ ఆటోమేటికల్‌గా వినియోగం మరియు నివసించే పరిస్థితులకు అనుగుణంగా కూలింగ్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. అంతేకాదు, జియో ఫెన్సింగ్ ఫీచర్‌ను వెల్కమ్ కూలింగ్ వినియోగించుకోవడం వల్ల వినియోగదారులు ఉన్న ప్రాంతానికనుగుణంగా మీ రూమ్‌ను ఆటోమేటికల్‌గా చల్లబరుస్తుంది.
శాంసంగ్ వాషింగ్ మెషీన్లు
శాంసంగ్ వాషింగ్ మెషీన్లలో డిజిటల్ ఇన్వర్టర్ మోటర్స్ ఉన్నాయి ఇవి అతి తక్కువ విద్యుత్ వినియోగించుకోవడంతో పాటుగా అతి తక్కువ శబ్దం మరియు వైబ్రేషన్స్ అందిస్తాయి. హైజీన్ స్టీమ్ ఫీచర్, వస్త్రాలు శుభ్రంగా మరియు శానిటైజ్ చేయబడ్డాయనే భరోసా అందిస్తాయి. ఇది డ్రమ్ అడుగు నుంచి ప్రవాహం విడుదల చేయడం వల్ల వాషింగ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ ఫలితంగానే డ్రమ్ లోపల ప్రతి గార్మెంట్ పూర్తిగా మునుగుతుంది. మురికిని హైజీన్ స్టీమ్ వదలగొట్టడంతో పాటుగా 99.9 శాతం బ్యాక్టీరియాను సైతం పోగొడుతుంది.