Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్
తన మొదటి ఎడిషన్ విజయవంతమైన అనంతరం ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ తన ఒక నెల అవధి రిటెయిల్ ఇనీషియేటివ్ ప్లాటినం సీజన్ ఆఫ్ హోప్‌ను అక్టోబరు 8, 2021 నుంచి నవంబరు 7, 2021 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వినియోగదారుడు మరియు మార్కెటింగ్ కార్యక్రమం తరహాలో ఇది దేశ వ్యాప్తంగా 1250 స్టోర్లలో నిర్వహించనున్నారు.
ఈ ఏడాది మరోసారి, ఆభరణాలు మరియు రత్నాల వ్యాపారం కొవిడ్-19 మహమ్మారి రెండో అలతో ప్రభావితమైంది. దాని మార్కెట్లు జూన్‌లో తెరచి ప్రారంభించడంతో గమనార్హమైన పునఃచేతను పొందాయి. అంతే కాకుండా మా అధ్యయనం ప్రకారం కొన్ని ఉత్తేజనకరమైన అంశాలు వెలుగు చూశాయి. ఈ అధ్యయనం ప్రకారం అమూల్యమైన ఆభరణంపై యువ వినియోగదారులు ఖర్చు చేసేందుకు ఎక్కువ ఉత్సాహాన్ని చూపించడం కొనసాగగా, 66శాతం మంది అంతే లేదా మరింత ఎక్కువ ఖర్చు చేస్తారన్న నిరీక్ష ఉంది. అంతే కాకుండా, ప్లాటినం వినియోగదారులకు ముఖ్యమైన అమూల్య ఆభరణంగా నిలిచింది. పలువురు దాన్ని విలువ కోసం కొనుగోలు చేయడాన్ని కొనసాగించగా, అది తన విలువను కాపాడుకోవడం ద్వారా వ్యక్తిగతంగా అర్థవంతమైన మరియు సదా స్మరణలో నిలిచి ఉండే గమనార్హమైన భావనలు మరియు బాంధవ్యాల గుర్తుగా నిలిచింది.
పిజిఐ అక్టోబరు 2020లో దేశంలో ప్లాటినం ఆభరణాల డిమాండ్ వృద్ధి చేసేందుకు ప్లాటినం సీజన్ ఆఫ్ హోప్‌ను ప్రారంభించింది. దీనితో అక్టోబరు 2020 అనంతరం వినియోగదారుల డిమాండ్ వృద్ధి చెందడంతో వ్యాపార సముదాయానికి సంతోషాన్ని తీసుకు వచ్చింది. దేశంలో 1289 స్టోర్లు ఇందులో పాల్గొనడంతో ఈ ఇనీషియేటివ్ ఇందులో పాల్గొన్న రిటెయిలర్లకు అదే అవధికి 29 శాతం మేర సగటు ప్రగతిని అందించింది. ఈ సంఖ్య వ్యూహాత్మక భాగస్వాములకు ఎక్కువగా అంటే 33 శాతం మేర ఉంది. పిజిఐ రిటెయిల్ వాటాదారులకు మార్చి 2021లో ప్లాటినం సీజన్ ఆఫ్ హోప్ మొదటి సీజన్లో పురస్కారాలనూ అందించింది.
ప్లాటినం సీజన్ ఆఫ్ హోప్ కార్యక్రమం గురించి తన అభిప్రాయాలను పంచుకున్న పిజిఐ-ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వైశాలి బెనర్జీ మాట్లాడుతూ 'మేము మార్కెట్ల పునశ్చేతనం వైపు చలించడాన్ని చూస్తున్నాము. క్యూ3 అత్యంత అవసరమైన ఉత్తేజనాన్ని అందించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది. మా భాగస్వాములు అదే సకారాత్మక ప్రగతి అప్డేట్లను పంచుకున్నారు, అలాగే వినియోగదారులు మరోసారి స్టోర్లకు తిరిగి వస్తుండడంతో భరోసా వచ్చింది. దీనితో వినియోగదారుల డిమాండ్ వృద్ధి చెందింది. అందుకే ఈ ఇనీషియేటివ్‌ను ప్రారంభించేందుకు దీనికన్నా ఉత్తమ సమయం మరొకటి లేదు. సీజన్ ఆఫ్ హోప్ మేము పండుగ సీజన్‌కు చేరుకుంటున్న సమయంలో అవసరమైన ఉత్తేజనాన్ని అందించే దిశలో నిర్వహిస్తున్నాము` అని పేర్కొన్నారు.
ప్లాటినం సీజన్ ఆఫ్ హోప్ మూడు ఆభరణాల విభాగాన్ని కలిగి ఉండగా, ఇందులో ప్లాటినం డేస్ ఆఫ్ లవ్-లవ్ బ్యాండ్స్ ఆఫరింగ్, మెన్ ఆఫ్ ప్లాటినం-పురుషుల ఆభరణాలు మరియు ఇవారా-నేటి యువ ఆధునిక మహిళలను లక్ష్యంగా చేసుకుంది. సీజన్ ఆఫ్ హోప్‌కు నూతన వాణిజ్య ప్రచార చిత్రంతో సదృఢమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్రణాళికను రూపొందించగా, అది అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారాలు మరియు పిఆర్ మార్కెట్లలో ఉన్నతమైన వ్యాప్తి మరియు పరిణామాన్ని చూపించనుంది.