Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్
అనగనగా ఒక ద్వీపం. ఆ ద్వీపం పేరు వింటేనే చలి జ్వరం వస్తుంది. కాళ్ళు ముందుకు అడుగు వేయడానికే సహకరించవు. పశు పక్షాదులు కూడా దూరని కారడివి. ఆ ద్వీపంలో అడుగడుగునా ఆటంకాలు. ఒకవేళ ఆ ఆటంకాలను ఛేదించుకుంటూ సొరంగమార్గంలో వెళితే పాతాళలోకం చేరుకుంటారు. అక్కడ ఉంది ఒక అద్భుత ద్వీపం. ఈ కథ అంతా ఎక్కడో విన్నట్టు, చూసినట్టుంది కదా? ఎందుకంటే ఈ కథ మన 'మాయాద్వీపం` కథ. అవును జీ తెలుగులో 7 ఏండ్ల తర్వాత ఈ షో ని మరోసారి అందరిముందుకు తేనుంది. అంతేనా, తెలుగు టెలివిజన్ కు అన్నయ్య అయినా ఓంకార్ ఈ షో ద్వారా మళ్లీ ఆ చానల్ లోకి వస్తున్నారు. ఆయనతోపాటు అందరికి ఎంతో ఇష్టమైన పిల్లమర్రిరాజు, ఒంటి కన్ను రాక్షసుడు ఈ ఆదివారం, అంటే అక్టోబర్ 3 నుంచి రాత్రి 9:00 గంటలకు మన ముందుకు వస్తున్నారు.
ఏడేండ్ల క్రితమే మాయాద్వీపం సెట్స్ ని అందరూ ఎంతో మెచ్చుకున్నారు. అది మళ్లీ మన ముందుకు వస్తుంది అంటే ఛానల్, ఓంకార్ టీం సెట్స్ ని ఇంకెంత ఘనంగా తీర్చిదిద్ది ఉండొచ్చు. అవునండి - తెలుగు టెలివిజన్ లో కనీవిని ఎరుగనంతగా, మునుపెన్నడూ ఏ నాన్-ఫిక్షన్ టీం చేయని విధంగా మాయాద్వీపం సెట్ ఉండబోతుంది. 'న భూతో న భవిష్యత్` అనేంత రీతిలో ఉండబోతుంది. అలా అంగరంగ వైభవంగా సెట్స్ ఉండడానికి 100 మంది టెక్నీషియన్స్ 50 రోజులు పైగా పగలు రాత్రి కష్ట పడి, ఎంతో వైవిధ్యమైన సెట్స్ ని రూపాందించారు.
ఈ సందర్భంగా మాయాద్వీపం యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ..'మాయాద్వీపం నా డ్రీమ్ ప్రాజెక్ట్. నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా మారింది ఈ షో తోనే. ఈ షో ఇచ్చిన ధైర్యం తోనే ఎన్నో షోస్ ను నిర్మించాను. ఇప్పుడు ఏడేండ్ల తర్వాత మళ్లీ నేను ఈ షో ని అందరిముందుకు తీసుకొస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అంతకుమించి, అందరికి ఎంతో ఇష్టమైన పిల్లమర్రిరాజు మరియు ఒంటి కన్ను రాక్షసుడు ని మరోసారి అందరి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంతే కాకుండా, అభిమానులందరినీ మరోసారి మాయా ప్రపంచం లోకి తీసుకెళ్లేందుకు అద్భుతమైన సెట్స్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి సెట్స్ ఇప్పటివరకు ఏ తెలుగు టెలివిజన్ నాన్-ఫిక్షన్ షో లో చూసి ఉండరు. అలాగే, ప్రోమో చూసిన తర్వాత వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ షో అందరికి నచ్చుతుందని, ఇప్పుడున్న పిల్లలకి కూడా మేము ఇంకా దగ్గరవుతామని భావిస్తున్నాను.`
ఈ షోకి కంటెస్టెంట్స్ గా 6 - 12 ఏండ్ల చిన్నారులు వస్తారు. ఈ పిల్లలని డిజిటల్ ఆడిషన్స్ పద్థతిలో సెలక్ట్ చేశారు. మాయాద్వీపం ఆడిషన్స్ అనగానే 12000 పైగా ఎంట్రీస్ పంపారు. ఆడిషన్స్ ఈ లెవెల్లో ఉంటే మరి ఆట ఎలా ఉంటుందో ఊహించండి. ప్రతీ ఎపిసోడ్ కి నలుగురు కొత్త కంటెస్టెంట్స్. ఆ నలుగురిలో ఎవరు చాకచక్యంగా, వారి తెలివితేటలతో, జ్ఞాపకశక్తి తో పాతాళ లోకం చేరుకొని ఒంటి కన్ను రాక్షసున్ని సంహరిస్తారో వారికే అద్భుతదీపంః దక్కుతుంది. చదువుతుంటే చూడాలి అనిపిస్తుంది కదా? మరి ఇంకా ఎందుకు ఆలస్యం, జీ తెలుగులో ఈ ఆదివారం 'మాయాద్వీపం` చూసేయ్యండి.
ప్రోమో - https://www.youtube.com/watch?v=N4x5pryTixc
జీ తెలుగులో ఈ ఆదివారం అక్టోబర్ 3 రాత్రి 9:00 గంటల నుంచి మాయాద్వీపం ప్రసారం కానుంది.