Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన పరిధిని రానున్న 18-24 నెలల్లో రెండు లక్షల గ్రామాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు దేశంలోని లక్ష గ్రామాలకు సేవలందిస్తున్నట్లు పేర్కొంది. వీటిని రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ఈ పథకంలో భాగంగా వచ్చే 6 నెలల్లో 2,500 మందిని సంస్థ కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ రాహుల్ శుక్లా తెలిపారు.