Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండియా, దేశ అధిపతిగా కేజివి కిరణ కుమార్ సంస్థలో చేరారు అని ది ఆర్చర్డ్ ఈరోజు ప్రకటించింది. జేజివి ఈ భూభాగములోని అన్ని వ్యాపార కార్యకలాపాలకు అధ్యక్షత వహిస్తారు. ది ఆర్చర్డ్ యొక్క ఈవిపి, హెడ్ ఆఫ్ స్ట్రాటజి అయిన ప్రశాంత్ బహదూర్ కు రిపోర్ట్ చేస్తారు. ముంబై, ఇండియాలో ఉంటూ కేజివి తన నైపుణ్యాన్ని కీలకమైన విశ్వవ్యాప్త సంగీత ప్రపంచలో ది ఆర్చర్డ్ యొక్క వ్యాపారము, అభివృద్ధి స్ట్రాటజీ కొరకు వినియోగిస్తారు. బ్యాంకింగ్, టెలికాం, టెక్ మరియు సంగీతములో రెండు దశాబ్దాల క్రాస్-ఇండస్ట్రీ అనుభవముతో కేజివి ఈ ది ఆర్చిర్డ్ కు వచ్చారు. ఇటీవల ఈయన లేబుల్ & ఆర్టిస్ట్ సొల్యూషన్స్, ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ డైరెక్టర్ గా ఉన్నారు. అక్కడ ఆయన ఒక పెద్ద జట్టును పర్యవేక్షిస్తూ, నిర్వహిస్తూ మూడు ఆర్ధిక సంవత్సరాలలో దృఢమైన అభివృద్ధిని అందించారు. అలాగే కేజివి ఇదివరకు ప్రముఖ రికార్డ్ లేబుల్ అయిన సారెగామ ఇండియా, ఆన్మొబైల్ గ్లోబల్ లి. వాయిస్ గేట్ టెక్నాలజీస్, భారతి ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి సంస్థలలో ప్రధానంగా పాత్ర పోషించారు.
“నేను ది ఆర్చర్డ్ కుటుంబములో చేరుతున్నందుకు చాలా సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నాను”, అని కేజివి కిరణ్ కుమార్ అన్నారు. “ప్రాంతీయ సంగీతము, కళాకారులకు పెరుగుతున్న సహకార అవకాశాలు, చిన్న ఫార్మాట్ సామాజిక సంగీతము యొక్క ఆవిర్భావము ఒక స్థాయి ప్లేయింగ్ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తూ సంగీతం యొక్క వినియోగము పట్ల వినియోగదారుడి ప్రవర్తనలో ప్రగతిశీల మార్పు మొదలైన అంశాలతో భారతీయ సంగీత పరిశ్రమకు ఇది ఒక మంచి సమయం. ఆర్చర్డ్ వారి సమగ్ర సేవలతో, స్థానిక కళాకారుల కొరకు ప్రేక్షకుల నవప్రవర్తక ప్రపంచవ్యాప్త పైప్ లైన్ ప్రీమియం పంపిణి సేవల ద్వారా లేబుల్స్ సృష్టించాలని ఆశిస్తున్నాను”.
“మార్కెట్ లో కేజివి యొక్క నైపుణ్యము అమూల్యమైనది,” అని ప్రశాంత్ బహదూర్, ఈవిపి, హెడ్ ఆఫ్ స్ట్రాటజి, ది ఆర్చర్డ్ అన్నారు. “ది ఆర్చర్డ్ కొరకు ఇండియా కీలక అభివృద్ధి జరిగే భూభాగము, కేజివి ఒక ప్రముఖ స్థానిక ప్లేయర్ కావడము వలన ఆయన ఫలితాలను అందించే సమయములో దీర్ఘ-కాలిక వ్యూహాలను, పెరుగుతున్న సంగీత ప్రపంచాన్ని అర్థంచేసుకుంటారు. ఆయనను ది ఆర్చర్డ్ కుటుంబములోనికి ఆహ్వానించుటకు మేము చాలా సంతోషిస్తున్నాము”.