Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష మందికి ఉద్యోగావకాశాలు
హైదరాబాద్: అమెజాన్ నేడు భారతదేశంలో తన గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ (CS) విద్యా కార్యక్రమం అమెజాన్ ఫ్యూచర్ ఇంజినియర్ను భారతదేశంలో ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా నాణ్యత కలిగిన కంప్యూటర్ విద్య అలాగే ఉద్యోగ అవకాశాలను తక్కువ ప్రాతినిధ్యం, బలహీన వర్గాలకు చెందిన సముదాయాలకు అందించనుంది. ఈ కార్యక్రమం మొదటి ఏడాదిలో భాగంగా అమెజాన్ 900కు నైగా ప్రభుత్వ, ప్రభుత్వ నిధులు అందుకుంటున్న పాఠశాలల్లో ఒక లక్షకు పైగా విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ నేర్చుకునే అవకాశాలను కల్పించనుంది.
దేశంలో ఏటా సిఎస్ ఇంజినియరింగ్ కోర్సులకు ఒక మిలియన్ విద్యార్థులు పేర్లు నమోదు చేయించుకున్నప్పటికీ ఆర్థికంగా అలాగే వెనుబడిన తరగతులకు చెందిన విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుండగా, ఆసక్తిదాయక పాఠ్యాంశాల మోడల్‌కు భాష అడ్డుగోడగా ఉండడం కారణంగా ఉంది. అంతే కాకుండా భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వ్యాప్తి కంప్యూటర్ల అందుబాటుకన్నా ఎక్కువగా ఉంది. చాలా వరకు ప్రస్తుత సిఎస్ లెర్నింగ్ మాడ్యూళ్లు, ఆన్లైన్ కంటెంట్ మొబైల్ స్నేహి కాదు, బదులుగా కంప్యూటర్ ఒక మాధ్యమంగా ఎంపిక చేసుకోవడం కూడా విద్యార్థులకు అదనపు అడ్డంకిగా ఉంది.
అమెజాన్ ఫ్యూచర్ ఇంజినియర్ విద్యార్థుల నుంచి – ఉద్యోగం వరకు సముదాయపు కార్యక్రమం కాగా, ఈ అంతరాన్ని భర్తీ చేసే సమగ్ర లక్ష్యంతో, ప్రారంభిక లెర్నింగ్, సీఎస్ విద్యను పర్సనల్, ఆన్లైన్ సంయోజిత లెర్నింగ్ విధానాల్లో అందుబాటులోకి తీసుకు రానుంది.
అమెజాన్ తన గ్లోబల్ నాలెడ్జ్ భాగస్వామి, కంప్యూటర్ సైన్స్ విద్యకు అంకితమైన లాభరహిత సంస్థ Code.org భాగస్వామ్యంలో భారతదేశంలోని విద్యార్థులకు ఉన్నత నాణ్యత అలాగే మొబైల్ కమ్యూనికేషన్ ఆధారిత కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. స్థానిక అవసరాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాలను ప్రభుత్వ పాఠశాలలకు భారతదేశంలోని ఉపాధ్యాయులు, విద్యార్థి సముదాయానికి రూపొందించారు. విద్యార్థులకు కోడింగ్ మౌలిక అంశాలే కాకుండా, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, భారతీయ భాషల్లో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (వాయిస్ టెక్నాలజీ) తదితర భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇచ్చిన సాంకేతిక కోర్సులను అందిస్తుంది.
అమెజాన్ నాణ్యత కలిగిన సిఎస్ విద్యను కర్ణాటక, ఢిల్లీ, హార్యినా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల తొడ్కొని వెళ్లే విద్యా-కేంద్రిత లాభరహిత సంస్థలతో భాగస్వామ్యాన్ని పొందనుంది. ఈ కార్యక్రమం ప్రాథమికంగా 6-12 తరగతుల విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఉపాధ్యాయులు అలాగే బోధకులకు కంప్యూటర్ సైన్స్‌ను ఎక్కువ అలవర్చుకునే విధానంలో బోధించేందుకు కూడా శిక్షణ ఇస్తుంది. కంటెంట్, పాఠ్యాంశాలను సిద్ధం చేయడమే కాకుండా అమెజాన్ ఫ్యూచర్ ఇంజినియర్ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు, అన్వేషించేందుకు అలాగే వాస్తవ ప్రపంచంలో దాని వినియోగాన్ని అత్యాధునిక అనుభవాల ద్వారా తెలియజేస్తుంది. ‘క్లాస్ చాట్స్’ విద్యార్థులకు సాంకేతిక పరిశ్రమకు చెందిన వృత్తులను అర్థం చేసుకునేలా అమెజానియన్స్ను భేటీ అయ్యే అవకాశాన్ని ఇస్తుంది.
‘అమెజాన్ సైబర్ రోబోటిక్స్ ఛాలెంజ్’లో విద్యార్థులు ప్రోగ్రామింగ్ మౌలిక అంశాలను కోడింగ్ రోబోల ద్వారా నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉత్పత్తులను వితరణ చేసేందుకు రోబోటిక్స్‌ను ఎలా వినియోగిస్తుందో ఆవిష్కరిస్తుంది.
‘‘భారదేశంలో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యలో ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ రంగంలో అసహజమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. మేము భారతదేశంలో ఫ్యూచర్ ఇంజినియరింగ్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చాలా సంతోషాన్ని కలిగి ఉన్నాము. యువత, వారి నేపథ్యం ఏమై ఉన్నప్పటికీ, వారికి నాణ్యత కలిగిన కంప్యూటర్ విద్య లభించాలని మేము విశ్వసిస్తాము. కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాన్ని వారికి అనుకూలం ఉన్న, ఎంపిక భాషల్లో అందుబాటులోకి తీసుకు వచ్చే, వారికి వారి ఉద్యోగం గురించి అవగాహన విస్తరించే సరైన కౌశల్యం అలాగే పరికరాలతో తయారుగా ఉండేలా చేసే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము’’ అని అమెజాన్ ఇండియా గ్లోబల్ సీనియరు ఉపాధ్యక్షుడు, కంట్రి హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ‘‘మేము విద్యార్థులు సాంకేతిక పరిహారాలు ఎక్కువ విశ్వాసం మరియు కౌశల్యపూర్ణమైన సృష్టికర్తలు కావాలని, వారికి అలాగే వారి చుట్టూ ఉన్న సముదాయాలకు అత్యుత్తమ భవిష్యత్తును నిర్మించాలన్న భరోసాను కలిగి ఉన్నాము’’ అని అమిత్ వివరించారు.
పలు సంవత్సరాల నుంచి అనేక దేశాల్లో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినియరింగ్ కార్యక్రమంలో భాగంగా పని చేయడం మేము చాలా సంతోషిస్తున్నాము. భారతదేశంలో అమెజాన్ విడుదలతో మా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఉత్సుకతతో ఉన్నాము’’ అని కోడ్.ఆర్గ్ వ్యవస్థాపకుడు, సిఈఓ హాది పర్టోవి తెలిపారు. ‘‘భారతేశంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినియర్స్ నెట్వర్కు భాగస్వాములతో ఉన్నత నాణ్యత కలిగిన కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాన్ని అందించడం, దేశ వ్యాప్తంగా విద్యార్థులకు ఈ 21వ శతాబ్దపు పునాదుల్లో సబ్జెక్ట్ నేర్చుకునేలా చేయాలని మేము వేచి చూస్తున్నాము’’ అని వివరించారు.
‘‘గత కొన్నేళ్ల నుంచి మేము భారతదేశంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థలతో పని చేస్తుండగా, సమానంగా నేర్చుకునే అవకాశాలను అందించడం విద్యార్థుల జీవితాలకు మాత్రమే కాకుండా వారి కుటుంబాలు, వారి చుట్టూ ఉన్న ఉపాధ్యాయులను కూడా ఎలా మార్చుతున్నామో చూశాము. కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం ద్వారా పొందే విమర్శనాత్మక చింతన మరియు సమస్య నివారణ కౌశల్యాలు భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబాల్లోని విద్యార్థుల అవకాశాలకు ఉన్న అడ్డుగోడలను బద్దలు కొడతాము’’ అని పీపుల్ ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈఓ కృతి భరోచా తెలిపారు. ‘‘మేము అమెజాన్ ఫ్యూచర్ ఇంజినియర్ కార్యక్రమంతో భాగస్వామ్యాన్ని పొందేందుకు, లెర్నింగ్ ఆనందాన్ని విస్తరించేందుకు అలాగే కంప్యూటర్ సైన్స్‌ను భారతదేశ వ్యాప్తంగా బాలల నిజ జీవితానికి అలవర్చేందుకు మరియు లెర్నింగ్ క్షేత్రంలో సమానత్వాన్ని తీసుకు వచ్చేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము’’ అని తెలిపారు.
పలు సంవత్సరాల నుంచి అమెజాన్ ఇండియా తన కార్యక్రమ పరిధి భారతదేశంలో సిఎస్ సంబంధిత విద్యా ఆఫర్ల బొకేను విస్తరిస్తోంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజినియర్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇంటర్న్‌షిప్‌లు, సమస్యను నియంత్రించే హ్యాకథాన్ కార్యక్రమాలు, అమెజానియన్ల ద్వారా ఉద్దేశిత మెంటర్షిప్ కార్యక్రమాల ద్వారా మద్ధతును వృద్ధి చేయనుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజినియరింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న పాఠశాలలు, పాలక మండలి ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఎక్కువ సమాచారాన్ని పొందవచ్చు.