Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, శాంసంగ్ నేడు తమ గెలాక్సీ ఎం52 5జీను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇది అతి సన్నటి, అత్యంత శక్తివంతమైన ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్. కేవలం 7.4 మిల్లీమీటర్ల పలుచటి డిజైన్, 6ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, సూపర్ అమోలెడ్ +120 హెర్ట్జ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మకియు గెలాక్సీ 5జీ వాగ్ధానమైనటువంటి 11 బ్యాండ్లుతో వస్తున్న గెలాక్సీ ఎం52 5జీ అసలైన # లీనెస్ట్ మీనెస్ట్ మానెస్టర్ గా నిలిచిపోతుంది.
గెలాక్సీ ఎం52 5జీ 6జీబీ+128 జీబీ వేరియంట్ ధర 29, 999 రూపాయలు కాగా 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర 31,999 రూపాయలు. గెలాక్సీ ఎం52 5జీ ఇప్పుడు శాంసంగ్ డాట్ కామ్, అమెజాన్ డాట్ ఇన్, సుప్రసిద్ధ ఆన్లైన్ పోర్టల్స్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల వద్ద లభ్యమవుతుంది. వినియోగదారులు ఇప్పుడు గెలాక్సీ ఎం52 5జీని ప్రత్యేక పరిచయ ధర 26,999 రూపాయలలో 6జీబీ+128 జీబీ స్మార్ట్‌ఫోన్‌ను 28,999రూపాయలలో 8జీబీ+128 జీబీ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌పై ప్రారంభమయ్యే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కొనుగోలు చేయవచ్చు, ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే లభ్యమవుతుంది. ‘‘గెలాక్సీ ఎం సిరీస్ ను 2019లో విడుదల చేశారు. వినియోగదారుల చెంతకు అర్ధవంతమైన ఆవిష్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో విడుదల చేసిన ఈ సిరీస్‌కు అప్పటి నుంచి అపూర్వమైన ఆదరణ స్మార్ట్‌ఫోన్ అభిమానుల నుంచి లభిస్తుంది. ఈ విభాగంలో తొలిసారి అనతగ్గ ఆవిష్కరణలు అయినటువంటి మానెస్టర్ డిస్ప్లే, పనితీరు, బ్యాటరీ దీనిలో ఉన్నాయి. శాంసంగ్ సిద్ధాంతానికి తగినట్లుగా, మేము హద్దులను మరింతగా విస్తరింపజేస్తూ గెలాక్సీ ఎం52 5జీను విడుదల చేశాం. ఇది మా # లీనెస్ట్ మీనెస్ట్ మానెస్టర్గా నిలిచిపోతుంది. తాజా స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ మరియు 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ + డిస్ప్లే, తో వినియోగదారులు మృదువైన, లీనమయ్యే అనుభవాలను ఆటలు ఆడుతున్నప్పుడు లేదా తమ అభిమాన కంటెంట్‌ను చూస్తున్నప్పుడు పొందుతామనే భరోసా పొందవచ్చు. గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు డిఫెన్స్ గ్రేడ్ నాక్స్ సెక్యూరిటీ మరియు 11 5జీ బ్యాండ్ మద్దతుతో వస్తుంది. ఇది ఈ ఉపకరణాన్ని భవిష్యత్‌కు సిద్ధంగా మలచడమే కాదు, అసాధారణ సురక్షితంగా ఉంచుతుంది. అందువల్ల వినియోగదారులు తమ డాటా భద్రంగా ఉంటుందనే భరోసా కలిగి ఉంటారు. ఇదంతా కూడా అలాట్రా స్లిమ్ 7.4 మిల్లీమీటర్ బాడీలో ప్యాక్ చేయబడటం చేత శైలి, ఆకర్షణల ఖచ్చితమైన సమ్మేళనంగా నిలుస్తుంది’’ అని ఆదిత్య బబ్బర్, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్, మొబైల్ మార్కెటింగ్, శాంసంగ్ ఇండియా అన్నారు.
‘‘స్నాప్‌డ్రాగన్ 778జీ ను వినియోగదారులకు ఎన్నో ప్రీమియం అనుభవాలను అందించే రీతిలో డిజైన్ చేశారు.ఇది మల్టీ మీడియా ట్రిపుల్ పవర్ హౌస్. ఫోటోగ్రఫీ, గేమింగ్, వీడియో వ్యాప్తంగా అత్యున్నత అనుభవాలను ఇది అందిస్తుంది. అదే సమయంలో సుదీర్ఘమైన బ్యాటరీ జీవితమూ అందిస్తుంది. ఇది అత్యద్భుతమైన ఫోటో, వీడియో క్యాప్చర్ అనుభవాలను అందించడంతో పాటుగా కలకాలం నిలిచి ఉండే మధురస్మృతులనూ అందిస్తుంది. గేమింగ్ పరంగా, ఇది ఎంపిక చేసిన స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్ ఫీచర్‌కు మృదువైన, అత్యున్నత గేమింగ్ అనుభవాల కోసం మద్దతునందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 778పై విప్లవాత్మక ఏఐ, అతి తక్కువ కాంతిలో వీడియో, మృదువైన జూమ్, ఆటోఫోకస్ వంటి ఫీచర్లను అందిస్తుంది. అదనంగా, ఇది అసలైన గ్లోబల్ 5జీ కనెక్టివిటీని సైతం అందిస్తుంది. అందువల్ల వినియోగదారులు రేపటి తరపు సాంకేతికతలను నేడే పొందగలరు’’అని సచిన్ కలాంత్రి, సీనియర్ డైరెక్టర్, క్వాల్కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు.
అతి సన్నటి డిజైన్
గెలాక్సీ ఎం52 5జీ, ఇప్పటి వరకూ ఎం సిరీస్ స్మార్ట్ఫోన్లలో అతి పలుచటిది. కేవలం 7.4 మిల్లీమీటర్ల డిజైన్ దీనిలో ఉంది. దీని ముందు తరం ఫోన్లతో పోలిస్తే ఇది 21% సన్నగా ఉంటుంది. దీని బరువు కేవలం 173 గ్రాములు. ఈ స్మార్ట్‌ఫోన్, అరచేతిలో అత్యంత సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. ఇది రెండు ఆకర్షణీయమైన రంగులు – ఐసీ బ్లూ మరియు బ్లేజింగ్ బ్లాక్‌లో లభ్యమవుతుంది.
అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్
స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్ కలిగిన గెలాక్సీ ఎం52 5జీ, కేవలం అత్యున్నత వేగంతో కూడిన పనితీరు అందించడం మాత్రమే కాదు, అత్యుత్తమ ఇంధన సామర్థ్యం సైతం ఇది అందిస్తుంది. దీనిలోని 6ఎన్ఎం చిప్సెట్ దీనికి తోడ్పడుతుంది. స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ గరిష్టంగా 55% వరకూ మెరుగైన సీపీయూ పనితీరును అందిస్తుంది. అలాగే 85%మెరుగైన జీపీయు పనితీరు మరియు 3.5 రెట్ల అభివృద్ధిని ఏఐ పనితీరుతో తమ ముందుతరం ప్రాసెసర్లను పోల్చినప్పుడు అందిస్తుంది.
అత్యున్నయూత డిస్ప్లే
గెలాక్సీ ఎం52 5జీలో మానెస్టర్ 6.7 ఎఫ్‌హెచ్‌డీ+ ఎస్ అమోలెడ్ + ఇన్ఫినిటీ –ఓ డిస్ప్లే ఉంది. సూపర్ స్మూత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వినియోగదారులు లీనమయ్యే అనుభవాలను, వాస్తవ జీవితపు యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు లేదా గేమింగ్‌లో ఉన్నప్పుడు ఒక్క బీట్ కూడా మిస్ కాకుండా అద్వితీయ అనుభవాలను అందిస్తుంది. గొరిల్లా గ్లాస్5 డిస్ప్లే, పై నుంచి పొరపాటున ఫోన్ జారిపడినా నష్టపోదనే భరోసా అందిస్తుంది. గెలాక్సీ ఎం52 5జీ లో సమగ్రమైన వినోద అనుభవాలు డాల్బీ అట్మాస్ (వైర్డ్ లేదా బ్లూ టూత్ హెడ్‌సెట్‌పై)పై అందించడం ద్వారాఅత్యద్భుతమైన శబ్ద నాణ్యత అందిస్తుంది.
అత్యుత్తమ 5జీ
గెలాక్సీ ఎం52 5జీ తమ వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రాప్యతను ఒకసారి దేశంలో 5జీ నెట్వర్క్ వ్యవస్ధ సిద్ధమైన వెంటనే అందిస్తుంది. పదకొండు 5జీ బ్యాండ్ల – ఎన్ 1, ఎన్3, ఎన్5, ఎన్7, ఎన్8, ఎన్20, ఎన్28, ఎన్40, ఎన్41, ఎన్66, ఎన్78తో వినియోగదారులు అత్యున్నత వేగంతో కూడిన డౌన్లోడ్స్ను ఆస్వాదించవచ్చు. వీటితో పాటుగా బఫర్ ఫ్రీ స్ట్రీమింగ్, అవారంతరాలు లేని గేమింగ్ సైతం ఆస్వాదించవచ్చు. గెలాక్సీ ఎం52 5జీ ఈ విభాగంలో స్మార్టెస్ట్ కొనుగోలుగా సాటిలేని మరియు సూపర్ ఫాస్ట్ 5జీ అనుభవాలను అందిస్తుంది.
అత్యుత్తమ కెమెరా
గెలాక్సీ ఎం52 5జీలో అత్యుత్తమ శ్రేణి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది మీ సోషల్‌మీడియా ఫీడ్‌ను వేగవంతంగా చేరేలా చేస్తుంది. వెనుక వైపు, గెలాక్సీ ఎం52 5జీల అత్యున్నత 64 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది ప్రకాశవంతమైన, అత్యద్భుతమైన చిత్రాలను ఒడిసిపడుతుంది. 12 మెగా పిక్సెల్ అలా్ట్ర వైడ్ లెన్స్, మీ క్లిక్స్‌కు అదనపు కోణం అందించడంతో పాటుగా ఒకే ఫ్రేమ్‌లో పూర్తి వివరాలనూ అందిస్తుంది. అలాగే 5 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, అత్యద్భుతమైన డిటైల్స్‌తో క్లోజప్ షాట్స్‌ను అందిస్తుంది. దీనిలోని 32 మెగా పిక్సెల్ కెమెరా అత్యద్భుతమైన, చూడగానే ఆకట్టుకునే సెల్ఫీలను తీసుకునే అవకాశం అందిస్తుంది.
బ్యాటరీ
గెలాక్సీ ఎం52 5జీలో మానెస్టర్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది అసలైన పవర్హస్గా ఉండటం మాత్రమే కాదు, తరచుగా చార్జ్ చేయాల్సిన ఇబ్బంది లేకుండా పగలు, రాత్రి మీరు చేయాలనుకున్నది చేసేలా తోడ్పడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 81 గంటల మ్యూజిక్ ప్లే టైమ్, 48 గంటల వరకూ వాయిస్ కాల్స్, 20 గంటల వరకూ వీడియో ప్లే టైమ్‌ను అందిస్తుంది. ఇది అవసరమైనప్పుడు తక్షణమే చార్జ్ అయ్యేలా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్కు మద్దతునందిస్తుంది. గెలాక్సీ ఎం52 5జీలో శాంసంగ్ నాక్స్ ఉంది. శాంసంగ్ యొక్క డిఫెన్ప్ గ్రేడ్ సెక్యూరిటీ వేదిక ఇది. కేవలం మాల్వేర్ మరియు అనుమానాస్పద భయాల నుంచి మీ డాటాను కాపాడడం మాత్రమే కాదు, మోసగాళ్ల కళ్ల నుంచి మీ భద్రతను సైతం కాపాడుతుంది. ఆల్ట్ జెడ్ ఫీచర్‌తో, వినియోగదారులు అప్రయత్నంగానే పబ్లిక్, ప్రైవేట్ మోడ్స్‌కు సైడ్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా మారవచ్చు. ఇది విప్లవాత్మకమైన శాంసంగ్ పే (ఎన్ఎఫ్సీ)తో వస్తుంది. తద్వారా కాంటాక్ట్‌లెస్ డిజిటల్ చెల్లింపులు సాధ్యమవుతాయి. గెలాక్సీ ఎం52 5జీలో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉంది. ఇది అమితంగా అభిమానిస్తున్న ఒన్ యుఐ 3.1 ఇంటర్‌ఫేజ్‌కు మద్దతునందిస్తుంది. ఒకే స్ర్కీన్ ద్వారా బహుళ అంశాలను చేయవచ్చు. అదే సమయంలో వినోదాత్మక, సౌకర్యవంతమైన కస్టమైజేషన్ అవకాశాలు కూడా ఉన్నాయి.