Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశపు సుప్రసిద్ధ టెలికమ్యూనికేషన్స్ సేవల ప్రదాత, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ (ఎయిర్టెల్), తమ వినియోగదారులకు డిజిటల్ వినోద అనుభవాలను మరింత ఉత్సాహంగా మారుస్తూ తెలుగు చిత్రం ‘లవ్‌స్టోరీ’తో భాగస్వామ్యం చేసుకుంది. దీనితో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల వ్యాప్తంగా ఎయిర్టెల్ వినియోగదారులకు ఇప్పుడు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం నాగ చైతన్య, సాయి పల్లవితో సహా తమ అభిమాన తారాగణంను కలుసుకునే అవకాశం కలుగుతుంది.
బ్రాండ్‌తో ఈ చిత్ర భాగస్వామ్యంలో భాగంగా ‘లవ్ స్టోరీ’ ప్యాక్స్‌ను ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ పై విడుదల చేయనున్నారు. అన్లిమిటెడ్ ప్రీ పెయిడ్ ప్యాక్ రీచార్జ్ చేసుకున్న వినియోగదారులు లేదా ఎయిర్టెల్ బ్లాక్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌కు మారిన వినియోగదారులలోని అదృష్టవంతులైన వినియోగదారులకు ఈ చిత్ర ప్రధాన తారాగణంను కలుసుకునే అవకాశం కలుగుతుంది. ఎయిర్టెల్ తమ కమ్యూనికేషన్ వేదికలన్నీ ఏకం చేయడంతో పాటుగా ఉత్సాహపూరితమైన పోటీలతో వినియోగదారుల నడుమ ‘లవ్‌స్టోరీ’ అనుభవాలను సజీవంగా నిలుపుతుంది. దీనిలో భాగంగా విజేతలకు ప్రత్యేకంగా ‘మీట్ అండ్ గ్రీట్’ అవకాశాలు లభించడంతో పాటుగా విజయవాడ, హైదరాబాద్‌లలో సినిమా టిక్కెట్లు, మరెన్నో సంతోషకరమైన అంశాలూ లభిస్తాయి.
ఈ భాగస్వామ్యం గురించి అవ్నీత్ సింగ్ పురి, సీఈఓ– ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణా, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో ‘లవ్‌స్టోరీ’ ఒకటి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూశారు. వారి ఆసక్తిని మరింత పెంపొందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని మా వినియోగదారులకు అతి సన్నిహితమైన వినోదాన్ని జోడించడం పట్ల ఎయిర్టెల్ వద్ద మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మొత్తం ‘లవ్‌స్టోరీ ’చిత్ర బృందానికి మేము అభినందనలు తెలుపుతున్నాం’’ అని అన్నారు. ఈ భాగస్వామ్యం గురించి వెంకటేశ్వర సినిమాస్ ప్రతినిధిలు మాట్లాడుతూ ‘‘ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. !
ఈ భాగస్వామ్యంతో ఇప్పటికే ప్రేక్షకుల నడుమ ఉన్న మా సినిమా ‘లవ్‌స్టోరీ’ మరింతగా ఆసక్తిని పెంపొందిస్తుంది. వినోద పరిశ్రమలో ప్రాంతీయ కంటెంట్‌ను ఎయిర్టెల్ ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యేందుకు మరో మాధ్యమంగా ఈ భాగస్వామ్యం నిలువనుంది’’అని అన్నారు. ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రంతో వ్యూహాత్మకంగా చేసుకున్న ఈ భాగస్వామ్యంతో, ఎయిర్టెల్ విస్తృతశ్రేణిలో ప్రచార కార్యక్రమాలను రూపొందించింది. ఇవి సాధారణ వాణిజ్య మరియు తమ సొంత వేదికలను సైతం కవర్ చేయనున్నాయి.