Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ దశలో సెన్సెక్స్ 1000 పాయింట్ల పతనం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం స్తబ్దుగా మొదలైన మార్కెట్లు నెమ్మదిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో తీవ్ర అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర విలువ కోల్పోయింది. చాలా సూచీలు కనిష్టాలకు పడిపోవడంతో మదుపర్లు తిరిగి అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తుదకు 410.28 పాయింట్లు లేదా 0.68 శాతం పతనమై 59,668కి పడిపోయింది. నిఫ్టీ 106.50 పాయింట్లు లేదా 0.60 శాతం కోల్పోయి 17,748.60 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియాల్టీ సూచీ అత్యధికంగా 3 శాతం విలువ కోల్పోగా, ఐటి రంగం 2 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్, లోహ సూచీ ఒక్క శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీలో భారతి ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ కార్ప్, కోల్ ఇండియా, ఎన్ టిపిసి, ఐఒసి, బిపిసిఎల్, సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టైటన్, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్ షేర్లు లాభాలు నమోదు చేసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. బీఎస్ఈలో సుమారు 1463 షేర్లు లాభాలు ఆర్జించగా.. 1715 షేర్లు నష్టపోయాయి. మరో 164 షేర్లలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.