Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్సంగ్ సోమవారం భారత మార్కెట్లోకి 5జి టెక్నాలజీ మద్దతుతో ఎం 52 మోడల్‌ను ఆవిష్కరించింది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివ్ సేల్స్‌లో భాగంగా ఈ ఫోన్‌ని తగ్గింపు ధరతో రూ. 26,999కే విక్రయిస్తున్నట్టు సామ్సంగ్ తెలిపింది. ఇందులో ఆధునిక స్నాప్‌డ్రాగన్ 778జి ప్రాసెసర్‌ని ఉపయోగించింది. ప్రాసెసింగ్ స్పీడ్, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ విభాగాల్లో ఈ ప్రాసెసర్ పని తీరు ఎంతో మెరుగని ఆ కంపెనీ పేర్కొంది. మొబైల్లో వెనుకు వైపు ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్ ఉండగా మిగిలిన రెండు కెమెరాలు 16 ఎంపి (ఆల్ట్రా వైడ్), 5 ఎంపి (మైక్రో లెన్స్)లు గాఉన్నాయి. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్స్‌గా ఉంది.