Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరి 31 నుంచి విమాన క్రూ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సులభంగా లభ్యమవుతున్న డ్రగ్స్, పెరుగుతున్న డ్రగ్ వినియోగదారుల సంఖ్య కారణంగా విమానయాన భద్రతపై తీవ్ర ఆందోళన రేగుతోందని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం విమానయాన సంస్థలు, ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ప్రొవైడెర్స్ ప్రతీ ఏడాది విమాన క్రూ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తాయి. పరీక్షలో ఎవరైన సిబ్బంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా వెల్లడైతే 24 గంటల్లోపు డీజీసీఏకి తెలియచేయాలి. మొదటిసారి పాజిటివ్‌గా తేలిన ఉద్యోగిని డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించి చికిత్స చేయించాలి. రెండోసారి కూడా పట్టుబడితే అతని లైసెన్స్‌ను మూడేండ్లపాటు నిషేధిస్తారు. మూడోసారి కూడా పట్టుబడితే లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేస్తారు.