Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలోని డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన డేటా, అవగాహనలు, ధోరణులతో భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటరాక్టివ్ వెబ్‌సైట్‌గా PhonePe Pulseను భారతదేశంలోని అగ్రగామి డిజిటల్ పేమెంట్స్ సంస్థ PhonePe ఇటీవల ఆవిష్కరించింది. ఈ వెబ్సైట్ భారతదేశంలోని 30 కోట్ల మందికి పైగా భారతీయుల యొక్క డిజిటల్ లావాదేవీ అలవాట్లను విశ్లేషించి జిల్లా స్థాయిలో భారతీయ పౌరులు ఎలా పే చేస్తున్నారనే విషయాన్ని చూపేందుకు జియో-స్పేషియల్ టెక్నాలజీని వినియోగించుకుంటోంది! డిజిటల్ పేమెంట్ ధోరణులపై ఖచ్చితమైన, సమగ్రమైన డేటాకోసం భారతదేశంలో శోధించగల సరైన గమస్థానంగా PhonePe Pulse నిలుస్తోంది.45% మార్కెట్ వాటాను కలిగి ఉన్నందున దేశం యొక్క డిజిటల్ పేమెంట్ అలవాట్లను PhonePe యొక్క డేటా ప్రతిబింబిస్తుంది.
ఆసక్తికరమైన విషయాలు:
దేశంలోని అన్ని రాష్ట్రాలలో కల్లా డిజిటల్ విస్తరణ తెలంగాణలోనే అత్యధికం. దేశంలోనే అత్యధిక డిజిటల్ విస్తరణ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. PhonePeలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల్లో సుమారు 44% మంది ఇక్కడ డిజిటల్ పేమెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. జాతీయ సగటుతో పోల్చితే, తెలంగాణ రాష్ట్రంలో PhonePe యాప్‌ను తెరిచే సగటు వినియోగదారు సంఖ్య 60% ఎక్కువగా ఉంది. 2021లోని రెండో త్రైమాసికంలో ₹1,02,796 కోట్ల మొత్త పేమెంట్ విలువ కలిగిన సుమారు 50 కోట్ల లావాదేవీలు తెలంగాణలో జరిగాయి..
Xiaomi ఫోన్లంటే తెలంగాణకు చాలా ఇష్టం
Xiaomi ఫోన్లు తెలంగాణలో అత్యధిక జనాదరణను పొందాయి. రాష్ట్రంలో వాటిని సుమారు 48 లక్షల మంది వినియోగదారులు ఉపయోగిస్తుండగా,37 లక్షలతో Samsung, 34 లక్షలతో Vivo వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2018 మొదటి త్రైమాసికం నుంచి వరుసగా 14 త్రైమాసికాలుగా Xiaomi తెలంగాణలో ఫేవిరెట్ ఫోన్‌గా నిలుస్తోంది. 2021 రెండో త్రైమాసికంలో21.3 కోట్ల లావాదేవీలతో హైదరాబాద్ జిల్లా అగ్రస్థానం.
తెలంగాణలోని మొదటి 5 జిల్లాలు డిజిటల్ లావాదేవీలలో 70%కు పైగా తమ ఖాతాలో కలిగి ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా 21.3 కోట్ల లావాదేవీలతో అగ్రస్థానంలో నిలవగా, 6.3 కోట్లతో రంగారెడ్డి జిల్లా, 5.9 కోట్లతో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలు క్రమంగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2018 నుండి 2021 వరకు ఇదే పరిస్థితి నిలకడగా సాగుతోంది.
నగదు బదిలీలు, మర్చంట్లకు పేమెంట్లే తెలంగాణలో ఫేవరెట్
తెలంగాణలో డిజిటల్ లావాదేవీలను ముందుకు నడిపించే ప్రధాన వినియోగాన్ని పరిశీలిస్తే, స్నేహితులు కుటుంబాలు, తెలిసిన వారికి నగదు బదిలీలకోసం 23 కోట్ల లావాదేవీలు జరిగాయి. అలాగే కిరాణా దుకాణాలు, ఆన్లైన్ స్టోర్లలో పేమెంట్లకోసం ఏకంగా 20.5 కోట్ల లావాదేవీలు జరిగాయి. PhonePe ద్వారా తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ల విస్తరణ ఇంత బాగా పెరుగుతుండడం, ఇంత గొప్ప విశ్వాసాన్ని అందుకుంటుండం ఆనందాన్ని కలిగిస్తోంది. లావాదేవీలు, వినియోగదారులు, విభాగాలు అన్నిటిలోనూ నిలకడైన వృద్ధిని ప్రతిబింబిస్తోంది. వీటిలో నగదు బదిలీలు, మర్చంట్ పేమెంట్లు, రీఛార్జిలు, బిల్ పేమెంట్లు, ఆర్థిక సేవల విభాగాలలో లావాదేవీలు వేగంగా వృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తోంది. అయితే. ఇది ప్రారంభ దశ మాత్రమే. రాష్ట్రంలో వృద్ధి చెందడానికి అవకాశాలు ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి.