Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: థ్రైవె డిజిటల్ హెల్త్ ఎల్ఎల్పి, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, రుజువైన, సమగ్రమైన థ్రైవె ప్లాట్‌ఫామ్స్ పై, ఇది తన ఆరోగ్యసంరక్షణా భాగస్వాములు, వారి వ్యాపారాన్ని నిర్వహించుకోడానికి, వారు ఉత్తమంగా ఏం చేయగలరో అది, అంటే ఆరోగ్య సంరక్షణ వినియోగదారులకి అనుకూల అనుభవాన్ని అందించడం, సేవ సంరక్షణలు మెరుగ్గా అందించే వీలుకల్పించడానికి, తరవాత తరం పరిష్కారాలని అందిస్తున్న సంస్థ.
"ప్రేమించడం, సంరక్షించడం, ఇవ్వడం" అనే లోతైన మూలాలు కలిగిన సంస్కృతితో, చెన్నై సమూహానికి తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) విభాగం ద్వారా చేయూత నివ్వడంలో ముందువరసలో వున్నాది. మహేష్ మెమోరియల్ లో రోగుల చికిత్సకు గదులు నిర్మించడం, యోగ్యతగల చికిత్సా కేంద్రాలకి అవసరమైన వైద్య పరికరాలని అందించడం, రక్తదాన శిబిరాలని నిర్వహించడం, లాప్టాప్స్, విద్యావిషయక సామగ్రిని స్పాన్సర్ చేయడం ద్వారా ఆర్థికంగా బలహీనంగా వుండే పిల్లలకి విద్యకోసం మద్దతునివ్వడం వంటి కాక్యక్రమాలుకూడా ఇందులోవే.
సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సిఎస్‌సి) అనేది, రిజిస్టర్ అయిన, లాభాపేక్షలేకుండా 2006లో స్థాపించిన సంస్థ. సైబరాబాద్ ఐటి కారిడార్ లో, భద్రత & రక్షణని ప్రోత్సహించడానికి సైబరాబాద్ పోలీసులతో కలిసి పనిచేస్తుంది. ఐటి కంపెనీల భద్రతా అవసరాలని చూడడానికి ఐటి పరిశ్రమతో సాధికారత పొందింది. ఎస్‌సిఎస్‌సి వివిధ అంశాలపై చొరవలు చేపట్టింది. విమెన్స్ సెక్యురిటీ ఫోరమ్, ట్రాఫిక్ ఫోరమ్, ప్లాస్మా డొనేషన్ డ్రైవ్, కొవిడ్ టెలిమెడిసిన్ సర్వీస్ వంటివి వాటిలో కొన్ని. అత్యంత ఎక్కువ వైద్య అత్యవసర పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, ముందు, రోగి వీలైనంత వేగంగా ఆస్పత్రికి చేరడం అత్యంత అవసరమైన విషయం అవుతుంది. కొవిడ్ మహమ్మారి రెండవసారి విరుచుకుపడినప్పుడు, హైదరాబాద్ నగరంలో కొవిడ్ రోగులకి కీలకమైన మద్దతు అందించడానికిగాను ఎస్‌సిఎస్‌సి, ఆంబ్యూలెన్స్ సేవల్ని ప్రారంభించింది.
ఎస్‌సిఎస్‌సి చేపట్టిన ఉత్తమ కృషికి అభినందనగా, పూర్తిస్థాయి సన్నద్ధతో, పూర్తి సిబ్బందితో వుండే ఆంబ్యులెన్స్ హైదరాబాద్ లో వుండేలా, ఎస్‌సిఎస్‌సి దాన్ని నిర్వహించేలా, ఆ ఆంబులెన్స్ ని థ్రైవె స్పాన్సర్ చేసింది. ఈ ఆంబులెన్స్ లో పేషెంట్ మానిటర్ మల్టీపరామీటర్ లైఫ్‌గార్డ్, సిపిఆర్ కిట్, మందులు చికిత్స ఇవ్వడానికి, ప్రాణపునరుద్ధరణ పరికరాలు, అవసరమైనవి, ఆక్సిజన్ సిలిండర్ వంటివన్నీ ఈ ఆంబులెన్స్ లో వుంటాయి.
శ్రీనివాస్ అ్యయగారి, సిహెచ్ఆర్ఒ, హెడ్ ఆఫ్ సిఎస్ఆర్ ఎఫర్ట్, థ్రైవె డిజిటల్, ఆ ఆంబులెన్స్ అందిస్తూ ఎస్సిఎస్సితో తమ భాగస్వామ్యాన్ని, హైదరాబాద్ లో ప్రజాసమూహాన్ని చేరుకోడంలో తొలి అడుగుగా అభివర్ణించేరు. ఈ నవాబుల నగరానికి భవిష్యత్ లో మరింత చేయబోతామని హామీ ఇచ్చారు. ఆస్పత్రి గదుల నిర్మాణం, పీడియాట్రిక్ కేన్సర్ కేర్ కోసం వెంటిలేటర్లు స్పాన్సర్ చేయడం, ఉద్యోగులు ఆస్పత్రులని సందర్శించి, వారితో సంభాషించి, వారికి నైతిక మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాలని థ్రైవె డిజిటల్ చేపట్టినట్టుగా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.