Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: బంగారం ఋణాలను అందించడంలో అగ్రగామి అయిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) ఇండెల్ మనీ, వినూత్నమైన రీతిలో సంప్రదాయ బంగారం ఋణ కో–లెండింగ్ భాగస్వామ్యాన్ని ఇండస్ఇంక్ బ్యాంక్‌తో చేసుకుంది. దీనిద్వారా మరింత మంది ఋణగ్రహీతలకు సరసమైన వడ్డీరేట్లలోఋణాలను అందించడం వీలవుతుంది. ఈ కో–లెండింగ్ భాగస్వామ్య ఒప్పందం కింద ఇండెల్ మనీ, పరస్పరం సూత్రీకరించిన ఋణ ప్రమాణాలు, అర్హతల కింద బంగారం ఋణాలను ప్రాసెస్ చేయనుంది. అత్యంత కీలకమైన సోర్సింగ్, డాక్యుమెంటేషన్, కలెక్షన్ మరియు లోన్ సర్వీసింగ్ సహా ఋణ జీవిత చక్రంలో వినియోగదారులకు ఈ కంపెనీ సేవలనందిస్తుంది.
ఈ కో లెండింగ్ అమరిక ద్వారా సృష్టించబడిన వ్యాపారంలో 80% బంగారం ఋణాలను ఇండస్ ఇండ్ బ్యాంక్ తమ బుక్స్‌లోకి తీసుకుంటే, 20%కు ఇండెల్ మనీ ఫండింగ్ అందించనుంది. దీని ద్వారా ఇరు సంస్థలూ తమ బంగారం ఋణ పోర్ట్‌ఫోలియోను దేశవ్యాప్తంగా విస్తరించడం సాధ్యమవుతుంది. ఇండెల్ మనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈవో ఉమేష్ మోహనన్ మాట్లాడుతూ ‘‘ఈ కో–లెండింగ్ భాగస్వామ్యం , మా పై అసాధారణ బాధ్యతను ఉంచింది మరియు మా నైపుణ్యం, సాంకేతిక సామర్థ్యంపై బ్యాంకుకు ఉన్న నమ్మకం, విలువను నొక్కి చెబుతుంది. ఈ భాగస్వామ్యంతో విస్తృతశ్రేణిలో వినియెగదారులను సేవ చేయడం వీలవుతుంది’’ అని అన్నారు.
ఇండస్ఇండ్ బ్యాంక్ , హెడ్ ఆఫ్ ఇన్‌క్లూజివ్ బ్యాంకింగ్ గ్రూప్ శ్రీనివాస్ బోనం మాట్లాడుతూ ‘‘బంగారం ఋణాలను అందించడం కోసం ఇండెల్ మనీతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాం. దక్షిణ భారతదేశంలో బలంగా ఉనికిని చాటుతున్న వీరు దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళిక చేశారు. ఈ భాగస్వామ్యం మా సిద్ధాంతానికి అనుగుణంగా ఉండటంతో పాటుగా సమర్ధవంతమైన, సమ్మిళిత ఋణ పరిష్కారాలను ఈ భాగస్వామ్యాల ద్వారా అందిస్తుంది’’ అని అన్నారు.