Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· మెరుగైన మన్నిక, పనితీరు మరియు ఆపరేటర్ సౌకర్యం వంటి సదుపాయాలతో సరికొత్త ఫీచర్లను జోడించుకున్న స్వరాజ్ ప్రో కంబైన్ 7060
· అత్యంత కఠినమైన భూ వాతావరణ పరిస్థితుల కోసం ప్రపంచ శ్రేణి ట్రాక్డ్ పరిష్కారాలతో వరి పంట కోసం రూపొందించి, అభివృద్ధి చేశారు
· అత్యుత్తమ శ్రేణి యంత్రసామాగ్రి, శక్తివంతమైన ఇంధన సామర్థ్యం కలిగిన 72హెచ్‌పీ ఇంజిన్‌తో రైతుల ఆదాయం వృద్ధి చేయడమే లక్ష్యం
హైదరాబాద్: స్వరాజ్‌కు చెందిన ట్రాక్డ్ హార్వెస్టర్ నూతన స్వరాజ్ ప్రో కంబైన్ 7060, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లోని వరి రైతులకు మెరుగైన ఉత్పాదకతను అందించడంతో పాటుగా అతి సులభంగా కార్యకలాపాల నిర్వహణ, పనితీరు సైతం మెరుగుపరచడంతో పాటుగా అత్యుత్తమ శ్రేణి విస్తీర్ణంతో పంట దిగుబడి మరింతగా మెరుగుపరచడమూ చేస్తుంది. నూతన వరి కోత యంత్రం అమర్చబడిన, నూతన స్వరాజ్ ప్రో కంబైన్ 7060, పడిపోయిన పంటను అతి తక్కువ ఖర్చుతో సైతం సమర్థవంతంగా కోయడంలోనూ మెరుగైన సామర్ధ్యం ప్రదర్శిస్తుంది. వరి, సోయాబీన్ పంటలను సమర్ధవంతంగా కోసే రీతిలో స్వరాజ్ రూపొందించి, అభివృద్ధి చేసిన నూతన కంబైన్ హార్వెస్టర్ అతి తక్కువగా గింజ నష్టం కలిగిస్తూనే, ముక్కలు చేయడంతో పాటుగా కోయడం, నూర్పిడి చేస్తూనే, ధాన్యాన్ని పోతపోయడం చేస్తుంది.
ధృడమైనది, శక్తివంతం, ఇంధన సామర్థ్యం అందించేలా తీర్చిదిద్దబడిన స్వరాజ్ ప్రో కంబైన్ 7060 ఆధారపడతగినది. దీనిలో 2300 ఆర్పీఎం వద్ద 72 హెచ్‌పీ శక్తిని అందించే ఇంజిన్ ఉంది. ధృడమైన, తక్కువ రేషియో రిడక్షన్ గేర్ బాక్స్‌తో పాటుగా అతి తక్కువ స్పీడ్, అతి తక్కువ వేర్ అండ్ టియర్ కోసం హై టార్క్ హైడ్రాలిక్ మోటర్ ఉండటం చేత సుదీర్ఘ జీవిత కాల హామిని ఇది అందిస్తుంది. భద్రతపై అధికంగా దృష్టి కేంద్రీకరించిన ఈ హార్వెస్టర్ లో ఓవర్‌హెడ్ గార్డ్ సైతం ఉంది. వ్యవసాయ క్షేత్రాలలో మరీ కిందగా ఉండే విద్యుత్ కేబుల్స్ కారణంగా ఎదురయ్యే విద్యుతాఘాతం నిరోధిస్తుంది.
ఈ ఆఫరింగ్ గురించి హరీష్ చవాన్, సీఈవో–స్వరాజ్ డివిజన్, ఎం అండ్ ఎం లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘కోతకాలం తగ్గడం, వ్యవసాయ రంగంలో మరింతగా సాంకేతికతను వినియోగించడం పెరగడంతో పాటుగా భౌతికంగా అమ్మకాలు, సేవలు, విడిభాగాల మద్దతు అనేది అత్యంత కీలకంగా మారిన సమయంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లోని రైతుల కోసం స్వరాజ్ ప్రో కంబైన్ 7060ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల స్వరాజ్ వద్ద మేము సంతోషంగా ఉన్నాము. మా నూతన ఉత్పత్తి వారికి గరిష్ట ఉత్పాదకత, నాణ్యత, దిగుబడికి భరోసానందిస్తూనే, కనిష్టంగా వ్యర్థాలు కలిగిస్తూనే, ఉత్పత్తి డౌన్‌టైమ్‌ను సైతం గణనీయంగా తగ్గిస్తుంది. తద్వారా రైతుల సంపాదనను సైతం వృద్ధి చేస్తుంది’’ అని అన్నారు.
స్వరాజ్ ప్రో కంబైన్ 7060 ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో స్వరాజ్ యొక్క విస్తృతశ్రేణి వాణిజ్య, సర్వీస్ నెట్‌వర్క్‌వ్యాప్తంగా విక్రయించడంతో పాటుగా సేవలనూ అందిస్తున్నారు. ఈ హార్వెస్టర్ అత్యంత ఆకర్షణీయమైన ధరలో లభిస్తుంది. పలు బ్యాంకులు, ఆర్ధిక సేవల కంపెనీల నుంచి ఫైనాన్సింగ్ కూడా లభ్యమవుతుంది. తడి మరియు మృదువైన నేలలకు అనుకూలమైన స్వరాజ్ ప్రో కంబైన్ 7060 ఇప్పుడు ఒడిషా, పశ్చిమబెంగాల్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో సైతం లభ్యమవుతుంది. కఠినమైన, ఆధారపడతగిన హార్వెస్టర్ల వారసత్వానికి తాజా జోడింపు స్వరాజ్ ప్రో కంబైన్ 7060. నాలుగు దశాబ్దాల క్రితం తమ మొదటి హార్వెస్టర్ విడుదల చేసిన స్వరాజ్, నేడు భారతదేశంలో హార్వెస్టర్ సాంకేతికతలో అగ్రగామిగా వీల్డ్, ట్రాక్డ్, ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్ల జాబితాను కలిగి ఉంది. వీటిని పంజాబ్‌లోని మొహాలీలో తయారుచేస్తున్నారు.