Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారతదేశానికి ఆరోగ్యవంతమైన యువ జనాభా చాలా అవసరం. వారే ఈ దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి వారి ఆరోగ్యం కోసం మెర్క్ షార్ప్ & డొహ్మే (యునైటెడ్ స్టేట్స్, కెనడాలో మెర్క్ & కో., ఇంక్. అని పిలుస్తారు) ఆధ్వర్యంలో నడుస్తున్న ఎమ్ఎస్డి ఫార్మాస్యూటికల్స్ ప్రై. లిమిటెడ్ దృష్టి సారించింది. అందులో భాగంగా భారతదేశంలో మొట్టమొదటి జెండర్ న్యూట్రల్ హెచ్పీవీ వ్యాక్సిన్ అయినటువంటి గార్డాసిల్ 9ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ లో (రకాలు 6, 11, 16,18, 31, 33, 45, 52 మరియు 58) ఉన్నటువంటి హెచ్పీవీ రకాల వల్ల వచ్చే వ్యాధుల భారాన్ని మరియు క్యాన్సర్లను తగ్గించడంలో సహాయపడుతుంది. భారతీయ బాలికలు మరియు మహిళల్లో (9-26 సంవత్సరాలు), భారతీయ అబ్బాయిలకు (9‐15 సంవత్సరాలు) ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ డివిజన్ యొక్క 'వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్: ది 2015 రివిజన్' పాపులేషన్ డేటాబేస్ ప్రకారం… ఇతర దేశాలతో పోలిస్తే… భారతదేశంలోనే అత్యధికంగా 10 నుండి 24 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారు. ఇది దాదాపు 229 మిలియన్లు. ప్రపంచంలోని మొత్తం జనాభాలో దాదాపు 20% మంది భారతదేశంలోనే ఉన్నారు. అంతేకాకుండా 2030 నాటికి ప్రపంచంలోని అతి పిన్న వయస్కులు అంటే యువత ఎక్కువమంది ఉండేది భారత్ లోనే. అందుకే వారి ఆరోగ్యం, వ్యాధి నివారణ ఇప్పుడు మనకు చాలా అవసరం. అందుకే వారి ఆరోగ్యం, వ్యాధి నివారణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. హెచ్పీవీ వ్యాక్సిన్స్ భారతదేశంలో హెచ్పీవీ సంబంధిత క్యాన్సర్ భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. (పురుషులు మరియు మహిళలు ఇద్దరూ) దేశంలో ఏటా 1.7 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత అంచనా ప్రకారం ప్రతి ఏడాది 96,922 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అలాగే 60,078 ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్ లో గర్భాశయ క్యాన్సర్ దేశంలో రెండో స్థానంలో ఉంది. అలాగే 15 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో వచ్చే వ్యాధుల్లోనూ 2 వ స్థానంలో ఉంది. హెచ్పీవీ గ్లోబల్ డిసీజ్ బర్డెన్లో... 9 హెచ్పీవీ సెరోటైప్స్ ఎక్కువ కారకాలుగా మారుతున్నాయి. అంతేకాకుండా కొన్ని భారతదేశంలో మరింత ప్రముఖంగా ఉన్నాయి.