Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ నష్టాలను చవి చూశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం, చైనాలో విద్యుత్తు కోతల నేపథ్యంలో భారత మార్కెట్లు ఒత్తిడికి గురైయ్యాయి. కొనుగోళ్ల మద్దతు లేకపోవడంతో తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 254 పాయింట్లు కోల్పోయి 59,606కు పడిపోయింది. సెన్సెక్స్-30లో 18 స్టాక్స్ ప్రతికూలతకు ఎదుర్కొన్నాయి. ఎన్ఎస్ఇ నిఫ్టీ 37 పాయింట్లు తగ్గి 17,711 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.62 శాతం, స్మాల్ క్యాప్ 0.40 శాతం చొప్పున నష్టపోయాయి. విద్యుత్, లోహ, ఫార్మా, రియాల్టీ సూచీలు 1 - 3.5 శాతం మేర కోల్పోయాయి. బీఎస్ఈలో 1835 షేర్లు లాభపడగా.. 1371 షేర్లు నష్టాలు చవి చూశాయి.