Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల జారీపై ఆర్బీఐ ఆంక్షలు సడలించిన తర్వాత నాలుగు లక్షల కార్డులను జారీ చేసినట్టు వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు మధ్యలో ఈ ఆంక్షలను ఎత్తివేయగా.. ఇకపై నెలకు సగటున మూడు లక్షల కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వచ్చే 3-4 త్రైమాసికాల్లో తిరిగి మార్కెట్ వాటాను పెంచుకోనున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ హెడ్ పరాగ్ రావు తెలిపారు. ఫిబ్రవరి 2022 నుంచి నెలకు 5 లక్షల కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బుధవారం ఆయన వర్చువల్గా మీడియాతో మాట్లాడుతూ గడిచిన జులై ముగింపు నాటికి 1.47 కోట్ల క్రెడిట్ కార్డులతో 23.2 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నామన్నారు. 3-5 ఏండ్లలో మూడు కోట్ల నుంచి ఆరు కోట్ల కార్డులకు చేరుకోనున్నామన్నారు. త్వరలోనే 10 కోట్ల క్రెడిట్ కార్డులకు చేరుకోనున్నామన్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు 1.47 కోట్ల క్రెడిట్ కార్డు ఖాతాదారులను కలిగి ఉంది.