Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వీడియోకాన్ ఇండిస్టీస్ యజమాని వేణుగోపాల్ దూత్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ భారీ జరిమానా విధించింది. వాటాదారులకు సమాచారం ఇవ్వకుండా వీడియోకాన్ షేర్లను తనఖా పెట్టడంతో పాటు అంతర్గత సమాచారంతో లావాదేవీలను నిర్వహించినందుకు సెబీ కొరడా ఝులిపించింది. 2017 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలంలో జరిగిన ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో తాజాగా రూ.75 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో పలుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ దూత్ స్పందించకపోవడం గమనార్హం. వీడియోకాన్‌కు దూత్ ప్రధాన ప్రమోటర్‌గా ఉండటంతో పాటు ఆయనే ఛైర్మన్, ఎండిగా కూడా ఉన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్తో లోపాయికరి ఒప్పందంతోనూ అక్రమంగా రుణాలు పొందిన విషయం తెలిసిందే.