Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : బంగారం ఋణాలను అందించే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) ఇండెల్ మనీ మరో విత్త సంస్థ ఇండస్ఇంక్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. సంప్రదాయ బంగారం ఋణ కో-లెండింగ్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు ఇండెల్ మనీ తెలిపింది. దీనిద్వారా మరింత మంది ఋణగ్రహీతలకు సరసమైన వడ్డీరేట్లలోఋణాలను అందించడం వీలవుతుందని పేర్కొంది. ఈ భాగస్వామ్య ఒప్పందం కింద ఇండెల్ మనీ పరస్పరం సూత్రీకరించిన రుణ ప్రమాణాలు, అర్హతల కింద బంగారం రుణాలను ప్రాసెస్ చేయనున్నట్టు పేర్కొంది.