Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తాము నిర్వహిస్తున్న ''గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్''లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఇందులో 450 నగరాలకు చెందిన 75,000 స్థానిక స్టోర్లకు తమ ప్రత్యేకమైన ఉత్పత్తుల ఎంపికను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్యాంపెయిన్‌ను హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, గద్వాల్, మహబూబ్‌నగర్, విశాఖపట్నం, తిరుపతితో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టాప్ ఇండియన్, గ్లోబల్ బ్రాండ్లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. ఈ పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేందుకు తెలంగాణలో 31,000 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 5,100 మంది విక్రేతలు సిద్ధంగా ఉన్నారని అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ డైరెక్టర్ సుమిత్ సహారు తెలిపారు.