Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60వేల దిగువన సెన్సెక్స్
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ నష్టాల పాలయ్యాయి. దీంతో గురువారం సెన్సెక్స్ 60వేల పాయింట్ల దిగువకు జారింది. ఉదయం కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత సూచీల్లో ఒత్తిడి నెలకొనడంతో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలు చవి చూశాయి. తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 286.91 పాయింట్లు లేదా 0.48 శాతం విలువ కోల్పోయి 59,126కు పడిపోయింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.10 పాయింట్లు లేదా 0.53 శాతం నష్టంతో 17,618 వద్ద ముగిసింది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉండగా.. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో టాప్లో ఉన్నాయి.