Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మౌల్డ్ టెక్ సీఎండీ వెల్లడి
- రూ.50 కోట్లతో ఐబీఎం ఉత్పత్తుల ప్లాంట్
హైదరాబాద్ : రానున్న మూడేండ్లలో రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రముఖ ప్యాకేజింగ్ ఉత్పత్తులను అందించే మౌల్డ్టెక్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) లక్ష్మణ్ జె రావు వెల్లడించారు. ఫార్మా, కాస్మోటిక్ ఉత్పత్తుల ఎగుమతులకు ఉపయోగించే ఇంజెక్షన్ బ్లో మౌడ్లింగ్ (ఐబీఎం) ప్యాకేజింగ్ ఉత్పత్తుల కోసం రూ.50 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. ఈ టెక్నాలజీ ప్లాంట్ను హైదరాబాద్ సమీపంలో పైలట్ ప్రాజెక్టు కింద రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే రెండేండ్లలో మిగితా రూ.40 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామన్నారు. ప్రస్తుతం ఐబీఎం మార్కెట్ రూ.5000 కోట్ల విలువ చేస్తుందన్నారు. ఇప్పటి వరకు తమకు తొమ్మిది తయారీ కేంద్రాలున్నాయన్నారు. వచ్చే మాసంలో తమ కాన్పూర్ ప్లాంట్ ప్రారంభం కానుందన్నారు. గతేడాది తమ సంస్థ రూ.480 కోట్ల టర్నోవర్ నమోదు చేసిందనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నామన్నారు. ప్రతీ ఏడాది సగటున 20 శాతం వృద్థితో వచ్చే మూడు, నాలుగేండ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.