Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ (ఎయిర్టెల్) నేడు తమ తాజా బ్రాండ్ గుర్తింపు Nxtra by Airtel ను తమ డాటా సెంటర్ వ్యాపారం కోసం విడుదల చేయడంతో పాటుగా భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్ధిక వ్యవస్ధ అవసరాలను తీర్చడం కోసం గణనీయంగా తమ డాటా సెంటర్ నెట్వర్క్ వృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడి ప్రణాళికలను సైతం వెల్లడించింది.
భారతదేశంలో Nxtra by Airtel కు అతి పెద్ద డాటా సెంటర్ల నెట్వర్క్ ఉంది. ఇది ప్రస్తుతం 19 భారీ, 120 ఎడ్జ్ డాటా కేంద్రాలను నిర్వహిస్తుంది. ఇవి వ్యూహాత్మకంగా భారతదేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండటంతో పాటుగా అత్యంత కీలకమైన సబ్‌మెరైన్ ల్యాండింగ్ స్టేషన్ల ను నిర్వహిస్తున్నాయి. ఎయిర్టెల్ యొక్క అంతర్జాతీయ నెట్వర్క్ తో జతకూడి, ఇది సురక్షితమైన, విస్తరించతగిన సమగ్రమైన పరిష్కారాలను గ్లోబల్ హైపర్‌స్కేలర్స్, భారీ భారతీయ వ్యాపార సంస్థలు, స్టార్టప్స్, ప్రభుత్వాలకు అందిస్తుంది. 5జీ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానుండటం, అత్యంత వేగవంతమైన డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ, వ్యాపార సంస్థలు క్లౌడ్ దిశగా మళ్తుండటం, స్థానిక డాటా స్టోరేజీ నియంత్రణలు వంటి వాటితో, భారతదేశంలో ఆధారపడతగిన డాటా సెంటర్ పరిష్కారాలకు బలీయమైన డిమాండ్‌ను చవిచూస్తుంది. భారతీయ డాటా సెంటర్ పరిశ్రమ రెట్టింపు కు పైగా వృద్ధి చెంది తమ ఇన్స్టాల్ చేయబడిన సామర్థ్యం 450 ఎండబ్ల్యు నుంచి 2023 నాటికి 1074 ఎండబ్ల్యుకు చేరుతుందని అంచనా.
ఈ వృద్ధిని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతుంది Nxtra by Airtel . 2025 నాటికి 5వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టడం ద్వారా పరిశ్రమలో అగ్రశ్రేణి హైపర్‌స్కేల్ మరియు ఎడ్జ్ డాటా సెంటర్ల నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. దీనిలో భాగంగా కీలకమైన మెట్రో నగరాలలో నూతన డాటా సెంటర్ పార్క్‌లను సైతం ఏర్పాటుచేయనున్నారు. ఈ పెట్టుబడులతో Nxtra by Airtelయొక్క ఇన్స్టాల్డ్ సామర్థ్యం మూడు రెట్లు వృద్ధి చెంది 400 ఎండబ్ల్యుకు చేరుకోనుంది. తద్వారా వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను అందుకోవడంతో పాటుగా తమ నెట్వర్క్ నాయకత్వంను స్థిరీకరించుకోనుంది.
అజయ్ చిత్కారా, డైరెక్టర్ అండ్ సీఈవో, ఎయిర్టెల్ బిజినెస్ మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో అతి పెద్ద డాటా సెంటర్ నెట్‌వర్క్‌ను ఎయిర్టెల్ నిర్మించింది, 5జీ మరియు డిజిటల్ ఇండియా అత్యంత కీలకంగా మారిన వేళ, మేము ఇప్పుడు ఈ వ్యాపారాన్ని రెట్టింపు చేయడంతో పాటుగా మా నెట్‌వర్క్‌ను సైతం వ్యాప్తి చేయనున్నాం. సురక్షిత డాటా సెంటర్లను నిర్వహించడంలో మా అనుభవం, వ్యాపార విభాగంలో బ్రాండ్ పట్ల లోతైన నమ్మకం, సమగ్రమైన డిజిటల్ పరివర్తన పరిష్కారాలను అందించడంలో మా సామర్థ్యం వంటివి భారతదేశపు కనెక్టడ్ ఎకనమీ అవసరాలను చక్కగా తీర్చనున్నాయి. ఈ సరికొత్త బ్రాండ్ గుర్తింపు ఈ లక్ష్యం, కోరికను ప్రదర్శించనుంది’’ అని అన్నారు.
డాటా సెంటర్లకు భారీగా విద్యుత్ అవసరమైన వేళ సస్టెయినబిలిటీ అనేది దృష్టి కేంద్రీకరించిన అతి కీలకమైన అంశంగా నిలుస్తుంది. Nxtra by Airtelఇప్పటికే చురుగ్గా గ్రీన్ ఎనర్జీని తమ డాటా సెంటర్ల అవసరాలను తీర్చేందుకు వినియోగిస్తుండటంతో పాటుగా ఎయిర్టెల్ యొక్క మొత్తం జీహెచ్జీ ఉద్గార తగ్గింపు లక్ష్యాలకు అనుగుణంగా పునరుత్పాదక వనరుల ద్వారా ఈ డాటా సెంటర్ల విద్యుత్ అవసరాలలో 50% తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. Nxtra by Airtelఇటీవలనే ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో క్యాప్టివ్ సోలార్ విద్యుత్ ప్లాంట్స్‌ను ప్రారంభించింది. త్వరలోనే మరిన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఎయిర్టెల్ యొక్క బీ2బీ వ్యాపారం ఎయిర్టెల్ బిజినెస్. భారతదేశంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సాంకేతికతలను అందించడంలో అగ్రగామిగా నిలువడంతో పాటుగా విస్తృతశ్రేణి ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. వీటిలో వాయిస్,డాటా, సహకారం, వర్క్ ఫ్రమ్ హోమ్ పరిష్కారాలు, క్లౌడ్, డాటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, నెట్వర్క్ ఇంటిగ్రేషన్, మేనేజ్డ్ సర్వీసెస్, ఎంటర్ప్రైజ్ మొబిలిటీ, డిజిటల్ మీడియా వంటివి విభిన్న పరిశ్రమల వ్యాప్తంగా అందిస్తుంది.