Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైజూస్ ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ లక్ష్యం
హైదరాబాద్: ప్రతి విద్యార్థి కూడా నాణ్యమైన విద్యను యాక్సెస్ చేయగలిగేలా చేసే ప్ర యాణంలో బైజూస్ తన ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమం కింద నాలుగు ఎన్జీఓలతో భాగస్వామ్యం చేసుకుంది. సేవ్ ది చిల్డ్రన్, స్మైల్ ఫౌండేషన్, లాడ్లీ ఫౌండేషన్, యురోపియన్ ఇండియా ఫౌండేషన్ వీ టిలో ఉన్నాయి. వీటి ద్వారా బైజూస్ తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల మురికివాడ ల్లోని 36,000 మంది జీవితాలపై సానుకూల ప్రభావం కనబర్చనుంది. ఈ భాగస్వామ్యం చిన్నారులకు బైజూస్ అధిక నాణ్యమైన,
సాంకేతిక చోదిత అభ్యసన కార్యక్రమాలకు ఉచితంగా యాక్సెస్ కల్పించనుంది. తమ సామాజిక, ఆర్థిక నేపథ్యాలతో, ప్రాంతంతో, ప్రావీణ్యతలతో సంబంధం లేకుండా ప్రతి చిన్నారి కూడా నాణ్యమైన విద్యను పొందగలగాలని బైజూస్ విశ్వసిస్తోంది. లోతైన విశ్లేషణలు చేసిన అనంతరం, 4 ఎన్జీఓల సాయంతో బైజూస్ రాష్ట్రంలో 10కి పైగా మురికివాడలను గుర్తించింది. రంగనాయకుల కాలనీ, హమాల్ బ స్తీ, బీజేఆర్ నగర్, సాకేత్ – కుషాయిగూడ, సంజీవ్ నగర్, ఎస్ఆర్ నగర్, బల్కంపేట – అమీర్ పేట్, ఇ స్నాపూర్ రోడ్,
కోరాటికల్, కనకాపూర్, రాజేంద్రనగర్ మండలం వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందబోయే పిల్లలంతా కూడా అత్యంత పేద కుటుంబాలకు చెందినవారు, మహ మ్మారి కారణంగా మరిన్ని బాధలకు గురైన కుటుంబాలకు చెందినవారు. వీరి కుటుంబాలు రోజువారీ కూలీ లు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, రైతులు, వలస కార్మికులకు చెందినవి. అవన్నీ కూడా అంతంతమాత్రం జీవనోపాధితో ఉండేవి, చదుకునే వీలు లేకుండా ఉన్నవే.
ఈ కార్యక్రమం గురించి బైజూస్ వైస్ ప్రెసిడెంట్ – సోషల్ ఇన్షియేటివ్స్ మాన్సికాసిల్ వాల్ మాట్లాడుతూ, ‘‘చదువులో సానుకూల ప్రణాళికాబద్ధమైన మార్పులు తీసుకువచ్చేందుకు సాంకేతికత సాయం తీసుకునేందుకు బైజూస్ లో మేం కట్టుబడి ఉన్నాం. మేం చేపట్టిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కార్యక్రమంతో మేం చక్కటి నాణ్యమైన విద్యతో చిన్నారులకు సాధికారికత కల్పించనున్నాం, వారి ప్రాంతీయ భాషల్లో కూడా. సమాన అభ్యసన అవకాశాలు కల్పించాలని, తమ వ్యక్తిగత అవసరాలకు
అనుగుణంగా తమ అభ్యసన వాతావ రణాన్ని ఏర్పరుచుకోగలిగిన వారినిసృష్టించాలనే లక్ష్యంతో మేం ఇంటర్నెట్ కు యాక్సెస్ లేని విద్యార్థుల కోసం అధిక నాణ్యమైన కంటెంట్ ను ప్రి- రికార్డె డ్
సెషన్స్ ను మేం అందిస్తున్నాం. దేశంలో నలుమూలల మూలల ఉన్న విద్యార్థులకు చదవు యొక్క పరివర్తన శక్తిని అందించాలని కోరుకుంటున్నాం. 2025 నాటికి 50 లక్షల మందికి సాధికారికత కల్పించడం మా లక్ష్యం’’ అని అన్నారు.
సుమారుగా 50:50 నిష్పత్తిలో 6-18 ఏళ్ల వయస్సులోని బాలికలు, బాలురు బైజూస్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కు వారు ఎంచుకున్న భాషలో ఇంగ్లీషు లేదా తెలుగులో ఉచిత యాక్సెస్ పొందగలుగుతారు.
ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న ఏడో తరగతి విద్యార్థి మౌనిక (అజీజ్ నగర్ మురికివాడ, తెలం గాణ) ఈ సందర్భంగా మాట్లాడుతూ,‘‘లాక్ డౌన్ సమయంలో అన్ లైన్ తరగతులకు హాజరు కావడం క ష్టంగా ఉండింది. అయితే, బైజూస్, సేవ్ ది చిల్డ్రన్ మాకు ఇప్పుడు అభ్యసన మెటీరియల్ ను సమకూర్చా యి. దాంతో నేను నా చదువును కొనసాగించే వీలు కలిగింది. బైజూస్ యాప్ నా సొంత భాషలో రికార్డెడ్ వీడియోలను కలిగిఉంది. అది ఆయా పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడాన్ని, నేర్చుకోవడాన్ని నాకు సుల
భతరం చేసింది. ఈ వీడియోలు కూడా మమ్మల్ని వాటితో నిమగ్నం చేసేలా కఠినమైన భావనలను సులభంగా అర్థం చేసేవిగా ఉన్నాయి‘‘ అని అన్నది.
ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న పదో తరగతి విద్యార్థిని రుతిక (గణేశ్ నగర్ మురికివాడ, తెలంగాణ) ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘లాక్ డౌన్ సమయంలో నేను చదువు కొనసాగించడం లో బైజూస్ నాకు తోడ్పడింది. వినోదంగా, ఆసక్తిదాయకంగా ఉండే వీడియోలకు నాకు యాక్సెస్ కల్పించింది. ఆయా భావనలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు అవి నాకు సాయం చేశాయి. నేను పొందిన గొప్ప ప్రయోజనం నా షెడ్యూల్ ప్రకారం నేను తరగతులకు హాజరు కాగలిగాను. అప్పటికప్పుడు సందేహాలు తీర్చుకోగలిగాను. కష్ట సమయంలో నా చదువు కొనసాగించేలా చేసినం దుకు బైజూస్, సేవ్ ది చిల్డ్రన్ నా ధన్యవాదాలు’’ అని అన్నది.
సాంకేతిక ఆధారిత అభ్యసన కార్యక్రమాల ద్వారా సమాన అభ్యసన అవకాశాలు కల్పించడం మరియు అ న్ని సామాజికార్థిక నేపథ్యాలు కలిగిన పిల్లలకు సాధికారికత కల్పించే ఉద్దేశంతో 2020లో ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని బైజూస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, దేశం లో డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు, సానుకూల మార్పు తీసుకువచ్చేందుకు బైజూస్ 23 రాష్ట్రాల్లో 55 ఎన్జీవోలతో భాగస్వామిగా మారింది.
బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్
నిరుపేద వర్గాలకు చెందిన లక్షలాది మంది చిన్నారులకు డిజిటల్ లెర్నింగ్ ను అందుబాటు లోకి తీసుకు రావాలనే లక్ష్యంతో, ప్రపంచ అగ్రగామి ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్ తన సామాజిక కార్యక్రమం ‘ఎడ్యు కేషన్ ఫర్ ఆల్’ను 2020 సెప్టెంబర్ లో ప్రారంభించింది. అన్ని రకాల ఆర్థిక నేపథ్యాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలను పొందేందుకు సమానావకాశాలు కలిగించడం ద్వారా చదువును ప్రజాస్వామీ కరించడం ఈ కార్యక్రమం లక్ష్యం. పేదవర్గాలకు చెందిన పిల్లలు సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతి సాధించేందుకు మెరుగైన అవకాశాలు పొందేందుకు ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. అవసరాల్లో ఉన్న పిల్లలకు నాణ్యమైన అభ్యసనాన్ని అందించడం ద్వారా విద్యాత్మక, డిజిటల్ అంతరాలను తొలగించడం ఈ కార్యక్రమం లక్ష్యం. భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో అమెరికన్ ఇండియా ఫౌండేషన్, యునైటెడ్ వే, రైట్ టు
లివ్, మ్యా జిక్ బస్, ఎస్ఒఎస్, సేవ్ ది చిల్డ్రన్, క్రై వంటి 40 కిపైగా భాగస్వాములతో ఈ కార్యక్రమం ఒక సానుకూల ప్రభావాన్ని కనబర్చింది. దేశవ్యాప్తంగా గత 8 నెలల్లో 5 లక్షల మంది విద్యార్థులు ఈ
కార్యక్రమం కింద లబ్ధి పొందారు. సొంతంగా, భాగస్వాముల ద్వారా అభ్యసన అవకాశాలు పొందలేని విద్యార్థులను చేరుకో వడాన్ని కూడా కంపెనీ వేగవంతం చేసింది. మరింత సమాచారం కోసం https://byjus.com/educationforall/ను సందర్శించగలరు.