Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంబుల్ హన్సిక మోత్వానీతో ఒప్పందం
హైదరాబాద్: మహిళల మొదటి సోషల్ నెట్వర్కింగ్ యాప్బంబుల్, ఒంటరిగా ఉంటున్న భారతీయులు అర్థవంతమైన సంబంధాలను గుర్తించేందుకు, డేటింగ్లో కొత్త ప్రపంచాన్ని నేవిగేట్ చేసేందుకు నటి హన్సిక మోత్వానీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వినోదం, సరదా ఆకర్షణీయంగా రూపొందించిన వీడియోలో బంబుల్లో అర్ధవంతమైన ప్రొఫైల్ను ఎలా తయారు చేసుకోవాలో హన్సిక మోత్వానీ చిట్కాలు, ఉపాయాలను పంచుకున్నారు. కొత్త సంబంధాన్ని గుర్తించడంలో మొదటి అడుగు వేయడాన్ని అందులో అర్థవంతంగా వివరించారు.
తన భాగస్వామ్యం గురించి హన్సిక మోత్వానీమాట్లాడుతూ 'బంబుల్ కుటుంబంలో భాగం కావడం చాలా సరదాగా ఉంది. ఈ సమయంలో, బ్రాండ్ చాలా సందర్భోచితంగా వ్యవహరించి, లక్షలాది మంది మహిళలను మొదటి అడుగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. మీరు ఆరోగ్యకరమైన అనుబంధాలను నెలకొల్పుకుని, వాటిని కొనసాగించేందుకు బంబుల్ను ప్రయత్నించమని నేను పూర్తిగా సిఫార్సు చేస్తున్నాను!' అని తెలిపారు.
బంబుల్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్సమర్పిత సమద్దర్ మాట్లాడుతూ 'మారుతున్న కాలానికి అనుగుణంగా డేటింగ్ గురించి మరింత ఉద్దేశపూర్వకంగా ఉండటం ద్వారా, ఆరోగ్యకరమైన, సమానమైన సంబంధాలను ఏర్పరచుకునేందుకు తన సముదాయానికి బంబుల్ సాధికారత కల్పిస్తూ వస్తోంది. హన్సిక మోత్వానీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. మా జెన్ జెడ్, మిలీనియల్ ఆడియన్స్ మొదటి అడుగు వేసేందుకు, ఆరోగ్యకరమైన, అర్థవంతమైన అనుబంధాన్ని ఏర్పరుచుకునేందుకు వారు ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాము' అని తెలిపారు.