Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తన వినియోగదారులను స్పామ్, స్కామ్ నుంచి రక్షించేందుకు, అడ్డంకులు లేని కమ్యూనికేషన్‌ను సాధ్యం చేసేందుకు కాంటాక్ట్‌లను పరిశీలించే అలాగే అనవసరమైన కమ్యూనికేషన్‌ను పరిశీలించే గ్లోబల్ ప్లాట్ఫారం ట్రూకాలర్ నేడు ‘‘దేశ్ కా ట్రూకాలర్’’ పేరిట క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. భారతదేశం వాస్తవానికి అత్యంత పెద్ద మార్కెట్టుగా ఉండగా, ఈ క్యాంపెయిన్ తన భారతీయ వినియోగదారుల్లో ఈ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే, భారతదేశాన్ని స్పామ్ రహితంగా చేయడం ద్వారా కంపెనీ తన నిబద్ధతను మరోసారి ధృవీకరిస్తోంది. ఈ క్యాంపెయిన్‌ను మరింత విస్తృతం చేసేందుకు ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ప్రారంభానికి సంబంధించిన హ్యాండిల్స్ విడుదల చేసింది.
హ్యాండిల్స్:
ట్విటర్: @truecaller_in
ఇన్స్టాగ్రామ్: @truecaller.india
భారతదేశంలో పలు సంబంధాలు విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి అనే ఆలోచన చుట్టూ ఈ క్యాంపెయిన్‌ను రూపొందించారు. మనం ఎంత స్వతంత్రులమైనా, ఎంత పరిజ్ఞానం ఉన్నా,ఏదైనా తీర్మానాన్ని తీసుకునేందుకు ముందుగా మన మిత్రులు, కుటుంబాలు, నమ్మకమైన వారి అభిప్రాయాలను తీసుకుంటాము. చాలా జాగ్రత్తగా పరీక్షించిన అనంతరమే విశ్వసించడం మన డీఎన్ఏలో భాగంగా ఉంది. అది థర్డ్ ఎంపైర్ ప్రకటించే నిర్ణయమైనప్పటికీ, సరైన జీవిత భాగస్వామి ఎంపికకు మీ తల్లిదండ్రులు ఇచ్చే ఆమోదం అయినా, మీరు విశ్వసించే ఎవరో ఒకరి మాటలు మీకు జీవితంలో నిర్ణాయక క్షణాల్లో సరైన తీర్మానం తీసుకునేందుకు సహకరిస్తాయని మీకు తెలుసు. ట్రూకాలర్ భారతదేశంలో తన విలువలతో కూడిన, దక్షత కలిగిన సేవలను దేశంలోని 200 మిలియన్ ప్రజలకు అందిస్తుండగా, సురక్షిత కమ్యూనికేషన్ పర్యావరణాన్ని సృష్టించింది.
దీని గురించి ట్రూకాలర్ ఇండియా డైరెక్టర్ మార్కెటింగ్ మనన్ షా మాట్లాడుతూ ‘‘భారతదేశం మా హోమ్ మార్కెట్‌గా ఉంది. మా సముదాయం సదా మాకు దిక్కు చూపించే నక్షత్రంలా మాకు వేగంగా వృద్ధి చెందేందుకు, సకారాత్మక మాటలను మా గురించి తెలియజేసేందుకు సహకరిస్తుంది. భారతదేశంలో 20 కోట్లకు పైగా ఎక్కువ మంది భారతీయులు మాపై విశ్వాసం చూపిస్తున్నారు అని తెలుసుకోవడం మాకు సంతోషాన్ని ఇస్తుంది. అది భారతదేశంలో సెల్‌ఫోన్ వినియోగదారుల్లో సగం జనాభా కావడం ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంటుంది. ఈ క్యాంపెయిన్ సందేశం ట్రూకాలర్ వినియోగంలో ప్రజల నమ్మకం, ట్రూకాలర్ వారి కమ్యూనికేషన్లను సురక్షితంగా, దక్షతతో ఉంచుతుందని మరోసారి ధృవీకరిస్తోంది.
ఈ వాణిజ్య ప్రచార చిత్రాన్ని ట్రూకాలర్ ఏజెన్సీ భాగస్వామి మైండ్ ఫ్లూయిడ్ తెరకెక్కించింది. భారతదేశం, దాని ప్రజలతో సుదీర్ఘమైన బాంధవ్యం కలిగిన నేపథ్యంలో ఈ ఆలోచన వచ్చింది. ఈ వాణిజ్య చిత్రాలు, డిజిటల్ అలాగే ఔట్‌డోర్ క్యాంపెయిన్ల ద్వారా తరాల కథలను అనుసరిస్తుంది. నిత్యం వాస్తవ జీవితాల ఘటనలను తీసుకు వస్తుంది. ట్రూకాలర్ వారికి ‘సరైన కాల్‌ను తీసుకునేందుకు’ ఎలా సహకరిస్తుందో తెలియజేస్తుంది. కొత్త క్యాంపెయిన్ గురించి మైండ్ ఫ్లూయిడ్ క్రియేటివ్ డైరెక్టర్ హరితా రావు మాట్లాడుతూ ‘‘భారతదేశంలో పలు భారతీయులు పూర్తి, కథలు, పూర్తి అభిప్రాయాలతో ఉన్నారు. ట్రూకాలర్ ఈ కథలు, అభిప్రాయాల చుట్టూ నిర్మించబడి ఉన్నాయి. అదే దేశ్కా ట్రూకాలర్ అయింది- జీవితం నుంచి చిన్న ఉప వ్యాఖ్యానాలను తీసుకుంది మా హృదయాలు ప్రేమతో నులి వెచ్చగా ఉన్నాయి. దేశ్కా ట్రూ కాలర్ సృష్టించే సమయంలో మన ముఖాల్లో నిరంతరం నవ్వు ఉంది’’ అని పేర్కొన్నారు.