Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో డిజిటల్ లావాదేవీలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ ఏడాదిలో సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) లావాదేవీల విలువ రూ.6.50 లక్షల కోట్లకు చేరింది. గడిచిన ఒక్క సెప్టెంబర్‌లోనే రూ.365 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బే వెల్లడించారు. కరోనా వ్యాప్తి , లాక్ డౌన్ కారణంగా బ్యాంక్‌లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో యుపిఐ చెల్లింపులు వేగంగా పుంజుకున్నాయన్నారు. గతేడాది మొత్తం డిజిటల్ చెల్లింపుల సంఖ్య 5,500 కోట్లకు చేరుకున్నాయని.. ఈ ఏడాది ఇది 7,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు.