Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాటా సెంటర్ వ్యాపారం విస్తరణ
న్యూఢిల్లీ : ప్రముఖ ప్రయి వేటు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ లిమి టెడ్ తమ డాటా సెంటర్ వ్యాపా రం కోసం రూ.5వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. దేశంలో తమ సంస్థకు ఎన్ఎక్స్ట్రా బై ఎయిర్టెల్ పేరుతో అతి పెద్ద డాటా సెంటర్ల నెట్వర్క్ ఉందని పేర్కొంది. త్వరలోనే 5జి సేవలు అందుబాటులోకి రానుండటం, అత్యంత వేగవంతమైన డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ, వ్యాపార సంస్థలు క్లౌడ్ దిశగా మళ్లడం, స్థానిక డాటా స్టోరేజీ నియంత్రణలు వంటి వాటితో దేశంలో ఆధారపడతగిన డాటా సెంటర్ పరిష్కారాలకు బలీయమైన డిమాండ్‌ను చవిచూస్తుందని ఆ కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి రూ.5వేల కోట్ల పెట్టుబడులను పెట్టడం ద్వారా పరిశ్రమలో అగ్రశ్రేణి హైపర్‌స్కేల్, ఎడ్జ్ డాటా సెంటర్ల నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు పేర్కొంది.