Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తైవాన్ టెక్నాలజీ సంస్థ అసుస్ భారత మార్కెట్లోకి కొత్తగా ఒఎల్ఇడి డిస్ప్లేతో వివోబుక్ కె15ను విడుదల చేసినట్లు తెలిపింది. దేశంలో ఈ టెక్నలాజీతో వస్తోన్న తొలి వివోబుక్ శ్రేణి ఇదేనని పేర్కొంది. తద్వారా అత్యంత అందుబాటు ధరలలో ఈ ఉత్పత్తులు లభించనున్నాయని తెలిపింది. అత్యాధునిక 11వ తరపు ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్, ఇంటెల్ ఐరీస్ ఎక్స్ గ్రాఫిక్స్ దీని ఫీచర్లుగా ఉన్నాయి. ఇవి ఇంటెల్ ఐ3, ఇంటెల్ ఐ5, ఇంటెల్ ఐ7, ఎఎండి ఆర్5 తదితర నాలుగు సిపియు వేరియంట్లలో లభిస్తాయి. వీటి ధరల శ్రేణీ రూ.45,990 నుంచి రూ.81,990గా ఉన్నాయి.