Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియాను బిడ్డింగ్‌లో టాటా సన్స్ దక్కించుకుందని సమాచారం. దీనిపై త్వరలోనే కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థపై నిర్ణయం తీసుకోనున్నారని పేర్కొన్నాయి. ఈ మంత్రివర్గంలో షాతో పాటు నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, జ్యోతిరాదిత్య సిందియా ఉన్నారు. ఎఐ ప్రయివేటీకరణలో భాగంగా టాటా సన్స్ తుది బిడ్‌ను దక్కించుకుందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలు వాస్తవ దూరమని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. దీనిపై నిర్ణయం తీసుకున్న వెంటనే మీడియాకు తెలియజేస్తామని దీపమ్ కార్యదర్శి తూహీన్ కాంత పాండే పేర్కొన్నారు.
ప్రభుత్వ కమిటీ నిర్ణయించిన కనీస ధర కంటే టాటాసన్స్ రూ. 3 వేల కోట్ల అధికంగా బిడ్ వేసినట్టు బ్లూమ్‌బర్గ్ కథనం ప్రచురించింది. ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఇటీవల కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. టాటా సన్స్‌తో పాటు స్పైస్ జెట్ సంస్థ బిడ్లను దాఖలు చేసింది. కేంద్ర మంత్రి అమిత్‌షా నేతత్వంలో మంత్రుల బందం చివరకు టాటా గ్రూపునకే అవకాశం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ అదే వాస్తవం అయితే 67 ఏళ్ల తర్వాత ఎయిరిండియాను తిరిగి టాటా గ్రూపు సొంతం చేసుకోనుంది. దీంతో ఎయిరిండియా పూర్తిగా ప్రయివేటుపరం కానుంది.