Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు ప్రత్యేక పండుగ ఆఫర్లను గెలాక్సీ ట్యాబ్లెట్లపై తమ ఆన్లైన్ వేదికలు – శాంసంగ్ డాట్ కామ్, అమెజాన్ డాట్ ఇన్, ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ మరియు ఎంపిక చేసిన శాంసంగ్ రిటైల్ స్టోర్ల వద్ద వ్యాప్తంగా ప్రకటించింది. ఈ ఆఫర్లు అక్టోబర్ 1 అర్థరాత్రి నుంచి ప్రారంభమమ్యాయి.
ఈ పండుగ ఆఫర్లలో భాగంగా, వినియోగదారులు అద్భుతమైన ప్రయోజనాలను గెలాక్సీ ట్యాబ్ ఎస్7+, గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 ఎఫ్ఈ, గెలాక్సీట్యాబ్ ఎస్ 6 లైట్, గెలాక్సీ ట్యాబ్ ఏ7, గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్‌పై పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ ఫుల్స్వైప్పై రూ.10వేలు వరకూ బ్యాంక్ ఆఫర్ లభించడంతో పాటుగా ఈఎంఐ, డెబిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపైకూడా హెచ్డీఎఫ్సీ కార్డు గ్రహీతలకు అమెజాన్‌పై ఐసీఐసీఐ కార్డుగ్రహీతలకు శాంసంగ్ డాట్ కామ్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ రిటైల్ స్టోర్ల వద్ద ఆఫర్లు లభ్యమవుతాయి.
బ్యాంక్ ఆఫర్లకు అదనంగా, క్యాష్ బ్యాక్‌ను సైతం వినియోగదారులు ఉత్సాహపూరితమైన బండెల్ ఆఫర్లను ఎంచుకున్న ఎడల పొందవచ్చు. దీనిద్వారా వారు కీబోర్డ్ కవర్‌పై రూ.10వేలు వరకూ తగ్గింపు పొందేందుకు అర్హత సాధిస్తారు. వినియోగదారులు గెలాక్సీబడ్స్ లైవ్‌ను 1999 రూపాయలలో బ్యాక్ కవర్‌ను 999రూపాయలలో బండెల్ ఆఫర్ వినియోగించి పొందవచ్చు.
గెలాక్సీ ట్యాబ్ ఎస్7+
తమ రేజర్ షార్ప్ 12.4 అంగుళాల డిస్ప్లే, సుదీర్ఘకాలం నిలిచి ఉండే బ్యాటరీ, విస్తరించిన మెమరీ, ఎస్ పెన్, ఆప్షనల్ కీ బోర్డ్ కవర్ వంటి వాటితో గెలాక్సీ ట్యాబ్ ఎస్7+ మీరు ఎక్కువగా ఆడేందుకు స్మార్ట్‌గా పనిచేసేందుకు తోడ్పడుతుంది. ఫ్లిప్‌కార్ట్‌పై ఇది గతంలో ఎన్నడూ చూడనటువంటి రీతిలో 54,999 రూపాయలలో లభ్యమవుతుంది.
గెలాక్సీ ట్యాబ్ ఎస్7ఎస్ఈ
విద్య, ఆటలు నడుమ సమతుల్యత పాటించేందుకు గెలాక్సీ ట్యాబ్ ఎస్7ఎస్ఈ మీకు సహాయపడుతుంది. ఇది విస్తృతశ్రేణిలో 12.4 అంగుళాల స్ర్కీన్, డ్యూయల్ స్పీకర్లుతో వస్తుంది. దీనిలో పునః సృష్టించిన ఎస్ పెన్ మరియు ఆప్షనల్ కీ బోర్డ్ కవర్ ఉంటుది. గెలాక్సీ ట్యాబ్ ఎస్7ఎస్ఈ ఇప్పుడు 34,999 రూపాయలలో శాంసంగ్ డాట్ కామ్, అమెజాన్ డాట్ ఇన్ ఎంపిక చేసిన శాంసంగ్ రిటైల్ ఔట్లెట్ల వద్ద లభ్యమవుతుంది.
గెలాక్సీ ట్యాబ్ ఏ7
ఈ సన్నటి, తేలికపాటి గెలాక్సీ ట్యాబ్ ఏ7 దీని యొక్క 10.4 అంగుళాల స్ర్కీన్, డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ స్పీకర్లు మరియు 64జీబీ అంతర్గతంగా నిర్మించిన స్టోరేజీతో అత్యంత ఆకర్షణీయంగా 14499 రూపాయలలో లభ్యమవుతుంది. వై–ఫై వెర్షన్ అమెజాన్ డాట్ ఇన్, శాంసంగ్ డాట్ కామ్, ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్‌పై లభ్యమవుతుంది.