Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మీ ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ (ఐఈఎక్స్), సెప్టెంబర్ 2021లో 8,997ఎంయు విద్యుత్ ను వాణిజ్యం చేయడంతో పాటుగా ఇయర్ ఆన్ ఇయర్ 59% వృద్ధిని నమోదు చేసింది. నేషనల్ లోడ్ డిశ్పాచ్ సెంటర్ ప్రచురించిన పవర్ డిమాండ్ డాటా ప్రకారం, దేశవ్యాప్తంగా గరిష్ట డిమాండ్ సెప్టెంబర్ 2021లో చూడటంతో పాటుగా 2% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి నమోదు చేసింది. అత్యధికంగా పీక్ డిమాండ్ 180.7 గిగావాట్ను చూడటంతో పాటుగా విద్యుత్ వినియోగం ఈ నెలలో ఫ్లాట్‌గా 114.5 బీయు ఉంది.
మొత్తం మీద 2022 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసంలో ఎక్సేంజ్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని వాల్యూమ్ పరంగా చూసింది. రెండవ త్రైమాసంలో విద్యుత్ మార్కెట్ 25,857 మిలియన్ యూనిట్ వాల్యూమ్‌ను చేరుకుంది. ఈ ఫలితంగా ఇయర్ ఆన్ ఇయర్ 57% వృద్ధిని విభిన్న మార్కెట్ల వ్యాప్తంగా చవిచూసింది. తమ వినియోగదారుల లక్ష్యత కార్యక్రమాలలో భాగంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిదారుల కోసం విలువ ఆధారిత సేవలు (వీఏఎస్)ను ఐఈఎక్స్ ప్రారంభించింది. ఈ సేవలను ఐఈఎక్స్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. జనరేషన్ ఫోర్కాస్టింగ్, క్వాలిఫైడ్ కో ఆర్డినేటింగ్ ఏజెన్సీ (క్యుసీఏ) ఎనలిటిక్స్ సొల్యూషన్స్ మొదలైన సేవలను పొందడానికి పునరుత్పాదక జనరేటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ సేవలను అత్యంత సరసమైన ధరలలో ఈ శ్రేణిలో అత్యుత్తమ సేవా ప్రదాతల చేత ఐఈఎక్స్ అందిస్తుంది. మా మొట్టమొదటి ఎంపానల్డ్ సేవా ప్రదాతగా క్లైమెట్ కనెక్ట్ చేరడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ ఉత్సాహ పూరితమైన ప్రయాణంలో మాతో భాగస్వామ్యం చేసుకోవాలనుకుంటున్న సేవా ప్రదాతలను స్వాగతించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.
డే –ఎహెడ్, టర్మ్–ఎహెడ్, రియల్ – టైమ్ విద్యుత్ మార్కెట్
డే–ఎహెడ్ మార్కెట్, సెప్టెంబర్ 2021లో 6,418 ఎంయు వాల్యూమ్ వాణిజ్యం చేసింది. సరాసరిన నెలవారీ ధర యూనిట్‌కు 4.4 రూపాయలుగా ఉంది. 2022 ఆర్థిక సంవత్సర రెండవ త్రైమాసంలో , ఎక్సేంజ్‌పై డే–ఎహెడ్ మార్కెట్ 17,305 ఎంయు వాణిజ్యం చేయడంతో పాటుగా ఇయర్ ఆన్ ఇయర్ 26% వృద్ధి నమోదు చేసింది. డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీలు అత్యధికంగా ఇప్పుడు తమ స్వల్పకాలిక సరఫరా అవసరాలను పోటీతత్త్వం, సౌకర్యవంతమైన పద్ధతిలో అందుకోవడానికి డే–ఎహెడ్ మార్కెట్ పట్ల ఆసక్తి చూపడం పెరిగింది. టర్మ్–ఏహెడ్ మార్కెట్లో ఇంట్రా –డే, కాంటిన్జెన్సీ డెయిలీ మరియు వీక్లీ కాంట్రాక్ట్స్ కూడా కలిపి 193 ఎంయు వాణిజ్యంను చేయడంతో పాటుగా ఈ నెలలో 81% ఇయర్ ఆన్ ఇయర్ నమోదు చేసింది. మొత్తం మీద, రెండవ త్రైమాసంలో టర్మ్–ఏహెడ్ మార్కెట్లో మొత్తంమ్మీద 1,571 ఎంయు వాణిజ్యం నిర్వహించగా, అత్యద్భుతమైన రీతిలో 438% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి నమోదు చేసింది.
రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్లో 1,843 ఎంయు వామీల్యూమ్ వాణిజ్యం జరిగింది. తద్వారా గణనీయంగా 162% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధిని నమోదు చేసింది. రెండవ త్రైమాసంలో, ఈ మార్కెట్ మొత్తం మీద 5,298 ఎంయు నమోదు చేయడంతో పాటుగా గణనీయంగా 125% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి నమోదుచేసింది. రియల్ టైమ్ విద్యుత్ మార్కెట్ యొక్క ఈ స్థిరమైన వృద్ధి, వాస్తవ సమయంలో అత్యంత సమర్థవంతంగా విద్యుత్ డిమాండ్– సరఫరా సమతుల్యత పరంగా పంపిణీ యుటిలిటీలు, పరిశ్రమలపై ఆధారపడటం పెరుగుతుండటం ఇది సూచిస్తుంది.
గ్రీన్ మార్కెట్
గ్రీన్ టర్మ్–ఎహెడ్ మార్కెట్ , అత్యధిక మొత్తంలో 543 ఎంయు ను ఈనెలలో చేరుకోవడంతోపాటుగా 555% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధిని సైతం నమోదు చేసింది. రెండవ త్రైమాసం కోసం, ఈ మార్కెట్ మొత్తంమ్మీద 1682 ఎంయును నమోదుచేసింది. ఈ మార్కెట్ చెప్పుకోతగ్గ వృద్ధిని పార్టిస్పెంట్ బేస్‌లో చూసింది. తమ విద్యుత్, ఆర్పీఓ అవసరాలను సమగ్రంగా, సౌకర్యవంతంగా, పోటీతత్త్వంతో తీర్చుకునేందుకు మరిన్ని యుటిలిటీలు, సీ అండ్ ఎల్ వినియోగదారులు పాల్గొనడం మార్కెట్లో కనిపించింది.
పునరుత్పాదక విద్యుత్ ధృవీకరణలు
కొన్ని పునరుత్పాదక విద్యుత్ సంఘాలు దాఖలు చేసిన పిటీషన్లు కు స్పందనగా అప్పిలేట్ ట్రిబ్యూనల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (ఏపీటీఈఎల్) స్టే ఆర్డర్ విధించిన కారణంగా 29 సెప్టెంబర్ 2021 జరుగాల్సిన ఆర్ఈసీ ట్రేడింగ్ సెషన్ జరుగలేదు. ఈ అంశం ఏపీటీఈఎల్ వద్ద ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. తుది నిర్ణయం కోసం వేచి చూడటం జరుగుతుంది.
విద్యుత్ ఆదా ధృవీకరణలు (ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లు)
ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లు (ఈఎస్సర్ట్స్)లో వాణిజ్యంను సైతం త్వరలోనే ఐఈఎక్స్ ప్రారంభించనుందని అంచనా. అండర్ పెర్ఫార్మ్, అవ్, ట్రేడ్ సైకిల్–2 (పాట్ 2) పథకం కింద విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మొత్తమ్మీద 8.87 ఎంటీఓఈ విద్యుత్ ఆదా చేయాలని పాట్–2 లక్ష్యంగా పెట్టుకుంది. 11 విద్యుత్ అధికంగా వాడే పరిశ్రమ రంగాల నుంచి 621 నియమిత వినియోగదారులు ఉన్నారు.
ఈ ఎక్సేంజ్ ఇప్పటికే రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. అవగాహన వెబినార్లను సైతం నిర్వహిస్తుంది.