Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· 10,000 కన్నా ఎక్కువ వ్యాపారులతో భాగస్వామ్యం
· 100కు పైగా ప్రాంతాల్లో అందుబాటు
ముంబయి: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన ఫెస్టివ్ ట్రీట్స్ 3.0 క్యాంపెయిన్‌లో భాగంగా 10,000కు పైగా ఆఫర్లతో భారతీయ హృదయాల్లో వెలుగులు నింపేందుకు వస్తోంది. ఇది 2020తో పోల్చితే 10 రెట్లు ఎక్కువ. ఈ ఏడాది కార్డులు, రుణాలు, సులభమైన ఇఎంఐలతో ఫెస్టివ్ ట్రీట్లను 10,000కన్నా ఎక్కువ ఆఫర్లను బ్యాంకు అందుబాటులోకి తీసుకు వస్తోంది.
ఈ ఏడాది ఫెస్టివ్ ట్రీట్ల థీమ్ ‘‘కరో హర్ దిల్ రోషన్’’. ఇది మనం చేసే చిన్న పనుల ద్వారా ఇతరుల జీవితాల్లో చక్కని మార్పు తీసుకు వస్తుందన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. బ్యాంకు తన శాఖలు, ఏటీఎంలు, స్టోర్లు/వెబ్సైట్లతో భాగస్వామ్యం, హైపర్ లోకల్ ఫోకస్ ఉన్న డిజిటల్ మీడియా క్యాంపెయిన్ల ద్వారా ప్రతి భారతీయుడిని చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది.
బ్యాంకు తన వినియోగదారులకు వారి వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన డీల్స్‌ను అందుకునేందుకు 100+ ప్రదేశాల్లోని 10,000+ పైగా వ్యాపారులతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. కొన్ని కీలక జాతీయ భాగస్వాములలో యాపిల్, అమెజాన్, షాపర్స్ స్టాప్, ఎల్జి, శామ్సంగ్, సోనీ, టైటాన్, సెంట్రల్, అజియో, రిలయన్స్ డిజిటల్, లైఫ్‌స్టైల్, అనేక ఇతర ప్రముఖ బ్రాండ్లు, కీలక ప్రాంతీయ సంస్థలైన విజయ్ సేల్స్, పోథీస్, డిజివన్, చెన్నై సిల్క్స్, జిఆర్టి జ్యువెలర్స్, ఫోన్వేల్, సర్గం ఎలక్ట్రానిక్స్, పూర్విక మొబైల్స్, ఎలక్ట్రానిక్ పారడైజ్ ఉన్నాయి.
సరికొత్త హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలని కోరుకునే రిటైల్ వినియోగదారుల నుంచి, మూలధన పెట్టుబడికి రుణం అవసరమయ్యే పారిశ్రామికవేత్తలు లేదా కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేసుకోవాలని చూస్తున్న రైతుల వరకు, ఫెస్టివ్ ట్రీట్స్ 3.0లో అందరికీ ఆఫర్లు ఉన్నాయి. కొన్ని ఆఫర్ల సమగ్ర ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:
· ప్రీమియం మొబైల్ ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్ ఇఎంఐలు. ఐఫోన్ 13పై రూ.6,000 క్యాష్‌బ్యాక్.
· ఎలక్ట్రానిక్స్, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వినియోగదారుల వస్తువులపై 22.5% వరకు క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఇఎంఐ
· వ్యక్తిగత రుణం 10.25% వడ్డీతో తక్షణమే ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుంది
· జీరో ముందస్తు ముగింపు (Zero Foreclosure)ఛార్జీలతో 7.50%వడ్డీతో కార్లపై రుణం
· ద్విచక్ర వాహన రుణాలపై 100%, 4% తక్కువ వడ్డీ రేట్లపై నిధులు లభిస్తాయి.
· జీరో ప్రాసెసింగ్ ఫీజు, ట్రాక్టర్ రుణాలపై 90% వరకు నిధులు
· వాణిజ్య వాహన రుణాలప్రాసెసింగ్ ఫీజుపై 50% తగ్గింపు
· రూ.75 లక్షల వరకు కొల్లేటరల్ ఫ్రీ వ్యాపార రుణాలు, 50% తగ్గింపు*
‘‘భారతదేశం అన్‌లాక్ అవుతున్న సమయంలో, మేము ప్రజల జీవితాలలో కొద్దిగా ఉత్సాహాన్ని నింపేందుకు మరియు మా వినియోగదారులకు అవసరమైన సమయాల్లో వారికి అండగా ఉంటూ,మొత్తం జాతీయ ఆర్థిక శ్రేయస్సుకు మద్ధతుగా మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాము’’ అని హెడ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిటెయిల్ అసెట్స్-గ్రూప్ హెడ్ అరవింద్ కపిల్ తెలిపారు. ‘‘ఇది వ్యక్తిగత రుణాలు,కార్ల రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు అలాగే చిరు వ్యాపారస్తులకు వ్యాపార రుణాలు, మూలధన పెట్టుబడి రుణాల వరకు అన్నింటినీ మా శ్రేణిలో ప్రతిబింబించేలా చూసుకున్నాము’’ అని వివరించారు.
‘‘క్రెడిట్ కార్డ్‌లపై మా ఆఫర్ల శ్రేణి కేవలం తిరిగి రావడమే కాకుండా బ్యాంగ్‌తో తిరిగి వచ్చింది. ఇది భారతదేశంలోని వినియోగ కథను ప్రోత్సహిస్తుంది’’ అని పేమెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఐటి గ్రూప్ హెడ్ పరాగ్ రావు పేరొన్నారు. ‘‘భారతదేశంలో క్రెడిట్, డెబిట్ మరియు ప్రీపెయిడ్ కార్డుల కోసం చేసే ఖర్చులలో మూడింట ఒక వంతు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ద్వారా జరుగుతుంది కనుక మేము ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాము’’ అని తెలిపారు.
‘‘మహమ్మారి కారణంగా ప్రజలకు అత్యంత సవాలుగా ఉండే కాలాలలో ఇది ఒకటి. ఫెస్టివ్ ట్రీట్స్ 3.0 అనేది కేవలం తనకోసం ఖర్చు చేయడం మాత్రమే కాదు, అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇతరులకు సహాయం చేయడం కూడా’’ అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీఎంఓ, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, లయబిలిటీ ప్రొడక్ట్స్, మేనేజ్డ్ ప్రోగ్రామ్స్ హెడ్, రవి సంతానం పేర్కొన్నారు. ‘‘ఇది ‘చెయిన్ ఆఫ్ గుడ్’ కాగా, ఇది మన చిన్న చిన్న చర్యలు కూడా ఉత్తమ ప్రభావాన్ని కలిగి ఉంటాయని, ఇతరుల జీవితాలను మార్చగలదనే నమ్మకంపై ఆధార పడి ఉంటుంది. పండుగ కొనుగోళ్లు చిరు వ్యాపారులకు, స్ర్పెక్ట్రం అంతా రికవరీ చెయిన్‌తో ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇది ఈ ఏడాది ఫెస్టివ్ ట్రీట్ల థీమ్ ‘‘కరో హర్ దిల్ రోషన్’’ లో ప్రతిబింబిస్తుంది’’ అని వివరించారు.