Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఇండో–ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఐఎఫ్సీసీఐ), 100కు పైగా ఫ్రెంచి కంపెనీల సీఈవోలు, సీఎక్స్ఓలు మరియు డిప్లొమాట్స్తో కూడిన ప్రతినిధుల బృందంను అక్టోబర్ 08న హైదరాబాద్కు తీసుకువస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంతో ఐఎఫ్సీసీఐ రాష్ట్రంలో ప్రస్తుత ఫ్రెంచ్ పెట్టుబడులను ప్రదర్శించడంతో పాటుగా వ్యూహాత్మక ప్రాంతం కావడం, అనుకూలమైన వ్యాపార వాతావరణం, అత్యాధునిక మౌలిక వసతులు, చురుకైన పరిపాలన, అనుకూలమైన యంత్రాంగం వల్ల పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా తెలంగాణాను నిలుపుతుంది. ఈ సదస్సు ముఖ్యోద్దేశం ఇండో–ఫ్రెంచ్ వ్యాపార విభాగానికి బీ2బీ, బీ2జీ సమావేశాల ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ప్రయోజనాలను ప్రదర్శించనున్నారు.
ఈ ప్రతినిధుల బృందం తెలంగాణా రాష్ట్రంలో ఫ్రెంచ్ కంపెనీలను సందర్శించడంతో పాటుగా పలు చర్చా కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నారు. వీటిలో భారతదేశంలో ఫ్రెంచ్ రాయబారి హిజ్ ఎక్స్లెన్సీ ఇమ్మాన్యుయేల్ ఎనాయిన్ ; తెలంగాణా రాష్ట్ర ఐటీ, ఈ అండ్ సీ, ఎంఏ అండ్ యుడీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖామాత్యులు కెటీ రామారావు ; ఐ అండ్ సీ , ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐఎఫ్సీసీఐ అధ్యక్షులు సుమీత్ ఆనంద్ పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి భారతదేశంలో ఫ్రెంచ్ రాయబార కార్యాలయం, తెలంగాణా ప్రభుత్వం, సీసీఈఎఫ్– ఫ్రెంచ్ ఫారిన్ ట్రేడ్ ఎడ్వైజర్స్, సీఐఐ, ఫ్రెంచ్ ఫ్యాబ్, బిజినెస్ ఫ్రాన్స్ మద్దతునందిస్తున్నాయి.
డైరెక్టర్ జనరల్ పాయల్ ఎస్ కన్వార్ మాట్లాడుతూ ‘‘భారతదేశంలోని ఫ్రెంచ్ కంపెనీలకు అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రంగా తెలంగాణా నిలుస్తుంది మరియు గత కొద్ది సంవత్సరాలుగా భారీ పెట్టుబడులు ఇక్కడకు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర అధికారులతో మరింత సన్నిహితంగా పనిచేయడం ద్వారా మరిన్ని కంపెనీలు తెలంగాణాలో పెట్టుబడులను పెట్టేందుకు ప్రోత్సహించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.