Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ఫెస్టివ్ ట్రీట్స్ 3.0 క్యాంపెయిన్లో భాగంగా 10,000కు పైగా ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 2020తో పోల్చితే 10 రెట్లు ఎక్కువని తెలిపింది. ఈ ఏడాది కార్డులు, రుణాలు, సులభమైన ఇఎంఐలతో ఫెస్టివ్ ట్రీట్లను 10,000కన్నా ఎక్కువ ఆఫర్లను బ్యాంకు అందుబాటులోకి తీసుకు వచ్చిందని తెలిపింది. ఇందుకోసం 100కు పైగా ప్రదేశాల్లోని 10,000 పైగా వ్యాపారులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందులో ఆన్లైన్, ఆఫ్లైన్ సంస్థలున్నాయని పేర్కొంది.