Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 9–10 తేదీలలో ఆఫ్‌లైన్ ప్రోపర్టీ ఎక్స్పో
హైదరాబాద్: భారతదేశంలో సుప్రసిద్ధ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాప్ టైగర్ డాట్ కామ్ , అక్టోబర్ 9–10 తేదీలలో హైదరాబాద్‌లో ‘రైట్ టు హోమ్’ శీర్షికన మెగా ఆఫ్‌లైన్ ప్రోపర్టీ కార్యక్రమం నిర్వహించబోతుంది. హైటెక్ సిటీ సమీపంలోని నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబోతున్న ఈ వార్షిక కార్యక్రమాన్ని ఆర్‌ఈఏ ఇండియా సొంతమైన కంపెనీ నిర్వహించబోతుంది. హైదరాబాద్‌లోని గృహ కొనుగోలుదారులు, సుప్రసిద్ధ డెవలపర్లను ముఖాముఖి కలుసుకుని, అత్యుత్తమ పండుగ ఆఫర్లను పొందే అవకాశం పొందగలరు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో నగరంలో సుప్రసిద్ధ డెవలపర్లు అయినటువంటి బ్రిగేడ్, ప్రెస్టిజ్, శ్రీరామ్, ఇన్కార్, రామ్కీ, ఫార్చ్యూన్ వంటి సంస్ధలు పాల్గొననున్నాయి.
‘‘ఆస్తి కొనుగోలుకు అత్యుత్తమ సమయంగా పండుగ సీజన్‌ను మనం భావిస్తుంటాం. కానీ, 2021 పండుగ సీజన్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైనంతగా మరే ఇతర సంవత్సరాల్లోనూ పండుగ సీజన్‌ను చూడలేదనడంలో అతిశయోక్తి లేదు. గృహ ఋణాలపై వడ్డీరేట్లు ఇప్పుడు అతి తక్కువగా ఉన్నాయి. ఇవి కేవలం 6.55% నుంచి కూడా లభిస్తున్నాయిప్పుడు...’’ అని రాజన్ సూద్, బిజినెస్ హెడ్, ప్రాప్‌టైగర్ డాట్ కామ్ అన్నారు. గుర్గావ్లో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రాప్‌టైగర్ డాట్ కామ్ , హైదరాబాద్‌లో నిర్వహించబోయే ఈ ఎక్స్పో అపూర్వ విజయం సాధిస్తుందని ఆశిస్తుంది. ఇప్పటికే ఈ రైట్ టు హోమ్ కార్యక్రమానికి 2300కు పైగా రిజిస్ట్రేషన్లు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ రెండు రోజుల భారీ కార్యక్రమంలో 300కు పైగా వాకిన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.