Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలను చవి చూశాయి. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ 555.15 పాయింట్లు లేదా 0.93 శాతం పతనమై 59,189.73కు పడిపోయింది. మదుపర్లు రూ.2,57,785 కోట్ల సంపదను నష్టపోయారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ 176 పాయింట్లు పతనమై 17,646కు క్షీణించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 665.02 పాయింట్లు కోల్పోయి 59,079.86 వద్ద నమోదయ్యింది. తుదకు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల కాపిటలైజేషన్ రూ.2,62,20,547 కోట్ల నుంచి రూ.2,57,785కు పడిపోయింది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఓఎన్జీసీ, యూపీఎల్, బ్రిటానియా ఇండిస్టీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. హిందాల్కో ఇండిస్టీస్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు భారీగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. రంగాల వారిగా క్యాపిటల్ గూడ్స్, ఐటీ, మెటల్, ఫార్మా, ఆటో, రియాల్టీ, పీఎస్యూ బ్యాంకు సూచీలు 1-3 శాతం నష్టాలు చవి చూశాయి.