Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఉచిత 4జీ సిమ్ ఆఫర్ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ ఉచితంగా ఈ సిమ్‌కార్డును అందిస్తున్నట్టు తెలిపింది. కొత్త వినియోగదారులతో పాటుగా ఇతర టెలికం నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారిన వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ 100కు మించిన తొలి రీచార్జ్ కూపన్ తీసుకునే వారందరికీ సిమ్ కార్డు చార్జీ రూ. 20ను కూడా ఎత్తివేసింది. ప్రస్తుతం ఈ ఉచిత సిమ్ ఆఫర్‌ను కేరళ సర్కిల్లో అందుబాటులో ఉండగా.. ఇతర సర్కిళ్లకు కూడా పొడిగించనుంది.