Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ (ఐఈఎక్స్) విద్యుత్ వాణిజ్యం 8,997 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యిందని తెలిపింది. ఇంతక్రితం ఏడాది ఇదే మాసంతో పోల్చితే 59 శాతం పెరుగుదల చోటు చేసుకుందని పేర్కొంది. నేషనల్ లోడ్ డిశ్పాచ్ సెంటర్ పవర్ డిమాండ్ డాటా ప్రకారం.. గడిచిన నెలలో దేశవ్యాప్తంగా గరిష్ట డిమాండ్లో 2 శాతం వృద్థి నమోదయ్యింది. స్థూలంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో విద్యుత్ ఎక్సేంజ్ మార్కెట్ భారీ వృద్థిని నమోదు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.