Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ సీజన్లో భారీ అమ్మకాలు
గత మూడు నెలలుగా తమ కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ వ్యాపారంలో శక్తివంతమైన వృద్ధిని శాంసంగ్ చూస్తుండడంతో పాటుగా తమ గృహోపకరణాలను ఆధునీకరించడంతో పాటుగా విలాసవంతంగా మార్చుకోవాలనుకుంటున్న వినియోగదారుల సెంటిమెంట్ ఈసారి మరింత ఎక్కువగా కనిపిస్తుండటంతో ఈ పండుగ సీజన్లో ప్రీమియం కేటగిరి టీవీలు, డిజిటల్ అప్లయెన్సెస్ అమ్మకాలలో 65% కు పైగా వృద్ధి చెందనుందని శాంసంగ్ అంచనా వేస్తోంది.
‘‘పండుగ కొనుగోళ్ల పరంగా వినియోగదారుల సెంటిమెంట్ ఈ సారి అత్యున్నతంగా ఉంది. ఇప్పటికే ఓనమ్, గణేశ చతుర్ధి పండుగల వేళ శక్తివంతమైన వృద్ధి చూశాము. మార్కెట్లను అన్లాకింగ్ చేయడం ఆరంభించిన తరువాత, ఇంటి వద్దనే ఉండి తాము పనిచేస్తోన్న వేళ అత్యాధునిక సాంకేతికతను వారు ఇంటికి తీసుకురావాలనుకోవడంతో డిమాండ్ కూడా అంతే గణనీయంగా పెరిగింది’’అని రాజు పుల్లన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , సీఈ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
వ్యాపార సంస్థలు, పరిశ్రమలు తెరుచుకోవడం, తగినంతగా వర్షపాతం నమోదుకావడం, సానుకూలంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో మొత్తం మీద శాంసంగ్ కోసం కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ వ్యాపారం ఈ పండుగ సీజన్లో 30%కు పైగా వృద్ధి చెందుతుందని అంచనా. ఈ పండుగ సీజన్ తరువాత కూడా డిమాండ్ సానుకూలంగానే ఉంటుందని పుల్లన్ అంచనా వేస్తున్నారు. ప్రీమియం ఉత్పత్తుల పరంగా శాంసంగ్‌కు బలీయమైన డిమాండ్‌ను చూస్తున్నామని పుల్లన్ వెల్లడించారు. క్యుఎల్‌ఈడీ టీవీలు 63% వద్ధి నమోదు చేస్తుండగా, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు 100% వృద్ధి నమోదుచేస్తున్నాయి. అలాగే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు ఆగస్టులో 50%కు పైగా వృద్ధిని నమోదుచేశాయి.
గత సంవత్సరం అన్‌లాక్ తరువాత ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ పట్ల పరిశ్రమ ఆశ్చర్యపోయింది. ఈ వృద్ధి వేగం ఈ సంవత్సరం మార్చి వరకూ కొనసాగింది. ‘‘మేము పండుగ సీజన్ కోసం ముందుగానే ప్రణాళిక చేయడంతో పాటుగా అందరికన్నా ముందుగా ఉన్నాం. మేమంతా కూడా తగు రీతిలో స్టాక్స్ నిల్వ చేసుకున్నాం. మా ప్రీమియం పోర్ట్‌ఫోలియోను నియో క్యూఎల్ఈడీ టీవీ, ద ఫ్రేమ్ టీవీ, ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్స్, ఏఐ ఎకోబబుల్ వాషింగ్ మెషీన్స్, విండ్ ఫ్రీ ఏసీలు మొదలైన వాటి ఆవిష్కరణతో విస్తరించడంతో పాటుగా పండుగ సీజన్ డిమాండ్‌ను అందుకోవడానికి సిద్ధమయ్యాం’’ అని పుల్లన్ అన్నారు.
పుల్లన్ మరింతగా మాట్లాడుతూ , గత సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం వృద్ధి అనేది టియర్ 2 మార్కెట్ల వైపు మళ్లింది. ఈ సంవత్సరం, ఈ బ్రాండ్ మెట్రోనగరాలతో పాటుగా టియర్ 2, 3 మార్కెట్లలో సైతం వృద్ధిని చూస్తుందన్నారు. శాంసంగ్ ఇప్పుడు ‘బిగ్ టీవీ ఫెస్టివల్’ను తమ 55 అంగుళాలు, ఆ పైన టీవీలు ‘హోమ్ లైక్ నెవర్ బిఫోర్’ఆఫర్లను తమ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్స్ మరియు ఏసీలపై అందిస్తుంది. వీటిద్వారా వినియోగదారులు 1,04,900 విలువ కలిగిన సౌండ్‌బార్, 25% వరకూ క్యాష్‌బ్యాక్, అతి తక్కువగా 990 రూపాయల ప్రారంభ ధరతో ఈఎంఐలను అందిస్తుంది. అదనంగా, శాంసంగ్ ఇప్పుడు ఉత్సాహ పూరితమైన డీల్స్‌ను ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ కాలంలో తమ విస్తృతశ్రేణి కన్స్యూమర్ డ్యూరబల్ ఉత్పత్తులపై అందిస్తుంది.