Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటన్ జ్యువెల్లరీ సిఇఒ వెల్లడి
హైదరాబాద్ : టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ అభరణాల విక్రయ సంస్థ తనిష్క్ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని స్టోర్లను తెరువనున్నట్లు ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, నల్లగండ్లలో రెండు కొత్త స్టోర్లను ప్రారంభించింది. ఈ సందర్బంగా టైటన్ జ్యువెల్లరీస్ సిఇఒ అజోరు చావ్లా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తమ స్టోర్ల సంఖ్య 12కు చేరిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మరిన్ని కొత్త స్టోర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. ఈ కొత్త స్టోర్లలో అక్టోబర్ 9వ తేది వరకు ప్రతీ కొనుగోలుపై ఉచిత బంగారం నాణెములను అందించనున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో 200 పైగా నగరాల్లో 360కి పైగా స్టోర్లను కలిగి ఉందన్నారు.